ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
వనపర్తి (న్యూస్ తెలుగు) : పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు అనగానే భయపడాల్సిన అవసరం లేదని చదువుకున్న విషయాలను అత్యుత్తమంగా రాసేందుకు ప్రయత్నం చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు ) సంచిత్ గంగ్వర్ ఉద్బోధించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఎం.బి గార్డెన్స్ లో ప్రభుత్వ వసతి గృహల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బి.సి. విద్యార్థులకు ప్రేరణ, పునఃశ్చరణ తరగతులు నిర్వహించారు. అన్ని సబ్జెక్టులపై నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ విద్యార్థులకు పరీక్షల పట్ల మానసిక సంసిద్ధత ధైర్యాన్ని నింపారు. విద్యార్థులు వార్షిక పరీక్షలు అనగానే అనవసర ఆందోళన పడుతుంటారని ఆందోళన వల్ల చడువుకున్నది సైతం పరీక్ష రాసే సమయంలో మరచిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అందువల్ల భయాన్ని వీడి చదువుకున్న వాటిని బాగా రాసేవిధంగ ప్రయత్నం చేయాలని సూచించారు. తద్వారా పదో తరగతిలో మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులందరూ బోర్డు పరీక్షల్లో పదికి పది సాధించాలని సూచించారు. పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఉండకూడదని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత, డిటిడిఓ ఎం.శ్రీనివాసులు, ఇంపాక్ట్ రవీంద్ర ధీర, ఉపాధ్యాయ నిపుణులు శ్రీనివాసులు, నాగరాజు, గోవర్ధన్, మధుసూదన్, శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు. (Story: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!