Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన

0

రాష్ట్రంలో రాక్షస పాలన

జ‌న‌సేన నేత గురాన అయ్య‌లు విమ‌ర్శ‌

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంద‌ని జ‌న‌సేన నాయ‌కులు గురాన అయ్య‌లు విమ‌ర్శించారు. మీడియాపై దాడి చేయడం వైసీపీ రౌడీ మూకల దుర్మార్గమ‌ని ఇక్క‌డ జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో అన్నారు. వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయ‌న్నారు. వారికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నార‌ని తెలిపారు. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా వదలటం లేదని దుయ్య‌బ‌ట్టారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ‘సిద్ధం’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారని, అలాగే ఈ రోజు కర్నూల్ ఈనాడు కార్యాలయం పై దాడి చేశారని చెప్పారు. ఇలా తమకు అడ్డొచ్చిన వారందరిపై ఉక్కుపాదం మోపుతూ వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డే లేదన్నట్లుగా పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. మీడియాపైనే దారుణాలకు దిగుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంద‌న్నారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని గమనించి రానున్న ఎన్నికల్లో వైకాపా నాయకులకు బుద్ధి చెప్పాల‌ని, జనసేన-టీడీపీ అభ్యర్ధులను గెలిపించి ప్రజా పాలన రావడానికి సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. (Story: రాష్ట్రంలో రాక్షస పాలన)

See Also: 

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version