జల్‌జీవన్ మిషన్ కు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు
విజయనగరం (న్యూస్ తెలుగు): గ్రామ జలసంఘాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ విధానంలో చేపట్టే జల్‌జీవన్ మిషన్ పనులు పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించే యీ కమిటీలో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ., జిల్లాపరిషత్ సి.ఇ.ఓ., జిల్లాపంచాయతీ అధికారి, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్, డి.డబ్ల్యు.ఎం.ఏ. ప్రాజెక్టు డైరక్టర్, సమగ్రశిక్ష ప్రాజెక్టు ఇ.ఇ., గ్రామీణ నీటిసరఫరా, సహజవనరుల నిర్వహణ, సమాజాభివృద్ధి రంగంలో నిపుణులైన ఒకరు సభ్యులుగా వుంటారని గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ. ఉమాశంకర్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏ ఏజెన్సీకి అప్పగించని అంతర్గత నీటిసరఫరా, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు పనులను కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జి.ఓ.ఆర్.టి.నెం.98 జారీచేయడం జరిగిందని యీ మేరకు జిల్లా స్థాయి కమిటీ గ్రామాల్లో చేపట్టిన పనులను పర్యవేక్షిస్తుందన్నారు.
అదేవిధంగా యీ పనుల నిర్వహణలో వచ్చే సాంకేతిక, పరిపాలన పరమైన సమస్యల పరిష్కారం, పనులు చేపట్టేందుకు అవసరమైన సామాగ్రి సమకూర్చడంలో సహాయపడేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.ఇ. పేర్కొన్నారు. (Story: జల్‌జీవన్ మిషన్ కు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!