Home టాప్‌స్టోరీ ఆయనతో మర్చిపోలేని అనుభూతి!

ఆయనతో మర్చిపోలేని అనుభూతి!

0
Kavya Thaper
Kavya Thaper

ఆయనతో మర్చిపోలేని అనుభూతి!

రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. యూనిక్ కంటెంట్ తో ‘ఈగల్’ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది: హీరోయిన్ కావ్య థాపర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  హీరోయిన్ కావ్య థాపర్ ‘ఈగల్’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

‘ఈగల్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?  
ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండ సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్  చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్ లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్ గా వుంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా వుంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

ఈగల్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ వుంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు(నవ్వుతూ). రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్ పై రవితేజ గారు, డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది.

రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్టివ్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి.

ఈగల్ విషయంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?
రచయిత మణిగారు ”అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది’ అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా తృప్తిని ఇచ్చింది. నా వరకూ పాత్రకు వందశాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను.

ఈగల్ జర్నీ ఎలా సాగింది ?
ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ లో ఇంటర్ నేషనల్ లెవల్ లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్ లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వవర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాని ఇంటర్నేషనల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. వారితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.

కోవిడ్ టైం మీ కెరీర్ పై ప్రభావం చూపించిందా?
కోవిడ్ కారణంగా దాదాపు అందరికీ ఒక బ్రేక్ టైం వచ్చింది. అయితే ఈ సమయంలో ఎక్ మినీ కథ, ఫర్జీ వెబ్ సిరిస్ చేశాను. అలాగే ఇంట్లో వుండటం, ఇంటి భోజనం తినడం, ఫ్యామిలీతో సమయాన్ని గడపటం, తోచిన సాయం చేయడం.. ఇవన్నీ కూడా చేసే అవకాశం ఆ సమయం కల్పించింది.

మీకు ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?
ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని వుంది(నవ్వుతూ). అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుంది. (Story: ఆయనతో మర్చిపోలేని అనుభూతి!)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version