మెగా డిఎస్‌సీ కాదు..దగా డిఎస్‌సీ!
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి : తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ బాబు
అవనిగడ్డ : కృష్ణా జిల్లా అవనిగడ్డలో మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు దండముడి చౌదరి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షలో టీడీపీ మాజీ శాసనసభ వైస్ ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిరుద్యోగుల ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ వేసి వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల ముందు సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులపై వైసీపీ ప్రభుత్వానికి కనికరం లేదని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేసి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. యువతకు అండగా ఉద్యమించే సమయం అసన్నమైంది. వైసీపీ ప్రభుత్వం దద్దరిల్లే విధంగా త్వరలో ఉద్యమిద్దాం. నిరుద్యోగులు, యువత ముందుకొచ్చి దగపడ్డ వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు తరలిరావాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేంతవరకు మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం జగన్‍ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటాం. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు సిద్ధిక్, పవన్ తదితరులు పాల్గొన్నారు. (Story: మెగా డిఎస్‌సీ కాదు..దగా డిఎస్‌సీ!)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2
రెస్పాన్స్ బట్టి డెవిల్‌కు సీక్వెల్!