సైమా-2023 వేడుకలు రంగం సిద్ధం!
15,16 తేదీల్లో దుబాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఏర్పాట్లు
![](https://newstelugu.net/wp-content/uploads/2023/09/YSR.jpg)
దక్షిణాది సినీ ఇండిస్టీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 ఈసారి దుబాయిలో జరగనున్నాయి. దుబారులోని వరల్డ్ ట్రేడ్ సెంటరులో నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సినీ రంగానికి సంబంధించిన భారతదేశం మొత్తంలో చాలా రకాల పురస్కారాలను అందిస్తున్నారు. అందులో సౌత్ ఇండియాలో ఉన్న సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల్లోని నైపుణ్యతను వెలికి తీసి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా). గత 11 సంవత్సరాలుగా ఈ వేడుకలు వేర్వేరు ప్రాంతాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ అవార్డుల వేడుక రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇండిస్టీలకు చెందిన వారికి ప్రదానం చేస్తుంటారు. ఎంతో అంగరంగ వైభవంగా పలువురు తారల తళుకుల నడుమ జరుగనుంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు అవార్డులను ప్రకటించబోతున్నారు. ఇక, రెండో రోజు తమిళం, మలయాళం ఇండిస్టీలకు సంబంధించిన అవార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని దక్షిణభారతదేశంలోని పేరున్న ఇద్దరు ప్రముఖ నటులు అందజేసే అవకాశం ఉంది. అవార్డులకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుంది. ప్రతిసారీ సైమా వేడుకలు నటీనటుల డ్యాన్సులు, స్కిట్‌లతో ఎంతో కోలాహలంగా జరుగుతాయి. అయితే ఈసారి కూడా ప్రేక్షకులకు అదే రేంజ్‌లో వినోదాన్ని అందించేందుకు సైమా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల, సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైమా వేదికపై స్టెప్పులేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితోపాటు పలువురు నటీనటులు ప్రేక్షకులను ఆటపాటలతో అలరించనున్నారు.
ఉత్తమ సినిమా విభాగంలో…
తెలుగులో బెస్ట్ మూవీ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్, డీజే టిల్లు, కార్తికేయ2, మేజర్, సీతా రామమ్ చోటు దక్కించుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ 11, సీతారామం 10 కేటగిరీల్లో పోటీపడ్డాయి. తమిళంలో పొన్నియిన్ సెల్వన్-1, విక్రమ్, లవ్ టుడే, తిరుచిత్రంబలం, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాలు బెస్ట్ మూవీ కేటగిరీలో పోటీపడుతున్నాయి. వీటిలో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ -1 10 విభాగాల్లో, కమల్ హాసన్ విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. కన్నడలో కాంతార, కేజీయఫ్-2, 777 చార్లీ, లవ్ మాక్‌టెయిల్ 2, విక్రాంత్ రోనా సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతున్నాయి. వాటిలో కాంతార, కేజీయఫ్-2 చిత్రాలు ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్లు దక్కించుకొని సత్తా చాటాయి. మలయాళ ఇండిస్టీ నుండి భీష్మ పర్వం, తల్లుమాల, హృదయం, జయ జయ జయ హే, జన గణ మన, న్నా తాన్ కేస్ కొడుకు వంటి చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీ పడుతున్నాయి. వాటిలో భీష్మపర్వం చిత్రానికి 8, థల్లుమాల మూవీకి 7 నామినేషన్లు దక్కాయి.
పండుగలా వేడుకలు
దుబాయిలో జరగబోయే సైమా వేడుకల నేపధ్యంలో గత ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ హాజరయ్యారు. ”సైమా అంటే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండిస్టీస్ అన్నీ కలిసి జరుపుకునే వేడుక. గత 11 ఏళ్లుగా నేను ఈ వేడుకల్లో భాగమవుతున్నాం. ప్రతీసారి కొత్తగా మొదలుపెట్టిన ఉత్సాహం, సంతోషం కలుగుతోంది. ఓ మంచి వేదికని ఏర్పాటు చేసి.. కళలపై ఒకే రకమైన అభిరుచి ఉన్న అందరినీ ఒకచోటకి చేర్చడంలో సైమా విజయవంతమైంది. అవార్డులు ఎవరికి వస్తే బాగుంటుందనే అంశం కంటే.. ఎంత ఎక్కువ మంది నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటే అంత బాగుంటుందనేది అభిప్రాయం వ్యక్తంచేశారు. గొప్ప నటులతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందాన్నిస్తుంది. అన్ని ఫిల్మ్ ఇండిస్టీస్ కలిసి ఎంతో గొప్పగా ఓ పండగలా జరుపుకునే ఈ వేడుకకోసం మేమూ ఎదురుచూస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ‘గత 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రతిష్ఠాత్మక దుబాయి నగరం వేదిక కానుంది. ఈ సారి జరిగే వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుంది. సౌత్ ఇండియాలో అనేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లోని సజనాత్మకతను గుర్తించేందుకు, ప్రతిభని ప్రోత్సహించేందుకు సైమా, నెక్సా కలిశాయి. ఇది చాలా ఆనందం కలిగించే విషయం. ఇకపైనా ఈ బంధం బలంగా ప్రభావం చూపించాలని ఆశిస్తున్నామని” బృందా ప్రసాద్ తెలిపారు.
గతేడాది ‘పుష్ప’ జోరు…
గతేడాది అక్టోబర్‌లో జరిగిన సైమా అవార్డుల్లో టాలీవుడ్ సినిమా ‘పుష్ప: ది రైజ్’ జోరు కనబర్చింది. ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు కేటగిరీల్లో అవార్డులు కైవసం చేసుకుంది. 2023 నామినేషన్లలో ఆర్‌ఆర్‌ఆర్, సీతారామం హవా కొనసాగింది. (Story: సైమా-2023 వేడుకలు రంగం సిద్ధం!)
– యడవల్లి శ్రీనివాసరావు, తెలుగు సినిమావిశ్లేషకులు
See Also
‘సైమా’ కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను
నటుడు త్రిగుణ్ నివేదితల వివాహ వైభోగం!
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106