Home వార్తలు టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

0
TCEI TO HOST WORLD PHOTOGRAPHY DAY ON AUGUST 29 th , AT HITEX!
TCEI TO HOST WORLD PHOTOGRAPHY DAY ON AUGUST 29 th , AT HITEX!

టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

– ఫొటో పోటీలు నిర్వహణ

– ఫొటో ఎగ్జిబిషన్మాస్టర్ క్లాసులు కూడా..

హైదరాబాద్ : 

భారతదేశంలో అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్స్ అసోసియేషన్ తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), దాని కానిస్ట్యూన్ట్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ (టీఈఎఫ్ఏ) ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈనెల 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు, క్రీడలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీసీఈఐ అధ్యక్షులు బలరాం బాబు, టీసీఈఐ జనరల్ సెక్రటరీ రవి బురా, టీఈఎఫ్ఏ కార్యదర్శి సందీప్ జైన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హైటెక్స్ (హైదరాబాద్)తెలంగాణ టూరిజం శాఖ మద్దతు ఇస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో వర్ధమాన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఫొటో పోటీలు నిర్వహిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతను గుర్తించేందుకు ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లచే ఫొటోగ్రఫీపై మాస్టర్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందులో విలువైన సమాచారాన్ని పంచుకోనున్నారు. ఫొటో కాంటెస్ట్ విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. వీటిని టోక్యో జపాన్ సెంటర్, అన్‌వ్రాప్ బిజినెస్, మార్ఫియస్ టూర్స్, అలంకృత రిసార్ట్, ఎస్పీఏ వారు అందజేయనున్నారు.

(టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version