సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ ఉత్పత్తులపై దాడి చేసి పట్టుకున్న వెల్ స్పన్
హైదరాబాద్:
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన వెల్‌స్పన్ వరల్డ్ ఇటీవలనే సింటెక్స్ బీఏపీఎల్‌ను కొనుగోలు చేసింది. ‘సింటెక్స్’ బ్రాండ్ పేరుతో ప్లాస్టిక్ నీటి నిల్వ ట్యాంకులను సింటెక్స్ బీఏపీఎల్ తయారు చేసి విక్రయిస్తుంది. సింటెక్స్ నేడు ప్రతి ఇంటి పేరుగా మారటంతో పాటుగా నీటి నిల్వ ట్యాంక్ వర్గానికి పర్యాయపదంగా మారింది. అయితే, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా వద్ద ‘సింటెక్‘ అని లేబుల్ చేయబడిన నకిలీ నీటి ట్యాంకులను వెల్‌స్పన్ బృందం గుర్తించింది. వెల్‌స్పన్ బృందం నకిలీ ఉత్పత్తుల వ్యాప్తిని అంతం చేయడానికి ఈ మోసాన్ని గుర్తించి, వెలికితీసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారుల సమక్షంలో విచారణ, దాడులు నిర్వహించబడ్డాయి. నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. జిల్లాలో ఇలాంటి నకిలీ నీటి నిల్వ ట్యాంకుల తయారీదారులు, సరఫరాదారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. (Story : సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ ఉత్పత్తులపై దాడి)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106