అలెర్ట్: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్!
Hyper Tension: ప్రపంచ అధిక రక్తపోటు దినం (హైపర్‌టెన్షన్ డే ) సందర్భంగా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ)-తెలంగాణ చాప్టర్‌తో భాగస్వామ్యం చేసుకుని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ (జీజీహెచ్), హైదరాబాద్ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. హైదరాబాద్ నగరవాసులు అధిక రక్తపోటు, మధుమేహ సమస్యల బారిన పడేందుకు అధిక అవకాశాలున్నాయనే ప్రమాద ఘంటికలను ఈ నివేదిక మోగించింది. జీజీహెచ్, సీఎస్‌ఐ ఉమ్మడిగా జీహెచ్‌ఎంసీలో ఈ అధ్యయనం చేయడంతో పాటుగా హైపర్‌టెన్షన్‌పై కోవిడ్-19 ప్రభావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ అధ్యయనం వెల్లడిరచే దాని ప్రకారం హైదరాబాద్ నగరంలో 50%కు పైగా ప్రజలు హైపర్‌టెన్షన్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మధుమేహ రాజధానిగా వెలుగొందుతున్న నగరం, హైపర్‌టెన్షన్ రాజధానిగా కూడా నిలిచే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం సూచించింది. దాదాపు 10వేల మంది రోగులను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ కు చెందిన స్టాటిస్టీషియన్ల సహకారంతో పరీక్షించడంతో పాటుగా ఆ నమూనాలు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించారు. మధ్యంతరంగా 5వేల మంది రోగుల ఫలితాలను సమర్పించారు.
కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా– తెలంగాణా చాఫ్టర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సాయి సుధాకర్ ఈ అధ్యయన ఫలితాలను తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖామాత్యులు టీ హరీష్ రావు సమక్షంలో విడుదల చేశారు. హైపర్‌టెన్షన్ బారిన పడేందుకు నగరవాసులకు అధిక అవకాశాలున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. గతంలో ఇది 25% గా ఉంటే ఇప్పుడది 40%కు వృద్ధి చెందింది. కోవిడ్ సమయంలో హైపర్‌టెన్షన్ కేసుల పరంగా వృద్ధి కనిపించడానికి ప్రధాన కారణాలలో జీవనశైలి మార్పులు, ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాల కారణంగా నిశ్చల జీవనశైలి పెరగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ఇతర కారణాలైనటువంటి ఉద్యోగం కోల్పోవడం వల్ల ఒత్తిడి, ఆర్ధిక నష్టాల వల్ల ఒత్తిడి మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. నగరంలో సరాసరి బీఎంఐ 24కంటే (అధిక బరువు) అధికంగా 70% మందిలో కనిపిస్తుంది. ఇది కూడా ముఖ్యమైన కారణాలలో ఒకటిగా నిలిచింది.
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణా చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ రాజీవ్ గార్గ్ మాట్లాడుతూ ‘‘ఈ సారి మేము 25 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వ్యక్తులను పరీక్షించాము. ఆఖరకు యువతలో కూడా అధిక రక్తపోటు, మధుమేహ బాధితులుగా మారుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి జీవనశైలిని విశ్లేషించినప్పుడు, ఆహారపు అలవాట్లు, పొగతాగడం, ఒత్తిడి స్థాయిలు వంటివి హైపర్‌టెన్షన్‌కు ప్రధానంగా తోడ్పాటునందిస్తున్నాయి. వీటితో పాటుగా కొరొనరీ ఆర్టెరీ డిసీజ్, మధుమేహం, ఊబకాయం వంటివి కూడా కారణమవుతున్నాయి’’ అని అన్నారు.
‘‘ఉప్పు తగ్గించి తీసుకోవడం, నూనెలు తక్కువగా వాడటం, కార్బోహైడ్రేట్స్ ను డైట్‌లో తక్కువగా తీసుకోవడం ప్రజలు అలవాటు చేసుకోవడంతో పాటుగా రోజువారీ జీవితంలో వ్యాయామాలను భాగంగా చేసుకోవాలి’’ అని డాక్టర్ రాజీవ్ గార్గ్ వెల్లడించారు.
గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్ క్లస్టర్ సీఓఓ డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు అయినటువంటి సీఈఓలు, నటులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులు మొదలైన వారు అకస్మాత్తుగా మరణించడం మనం కోవిడ్–19 మరియు అనంతర కాలంలో చూశాము. కోవిడ్ మరియు కోవిడ్ అనంతర కాలంలో జరుగుతున్న ఈ సంఘటనలకు మూల కారణం ఏమిటనేది తెలుసుకోవాలనుకున్నాము. ఈ అధ్యయన ఫలితాల విశ్లేషణలో వెల్లడైనఅంశమేమిటంటే, గతంలో హైదరాబాద్‌లో 25% మంది మధుమేహ రోగులు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 33%కు చేరింది. చాలా వరకూ కేసులలో మధుమేహులలో లక్షణాలు ఎక్కువగా కనబడటం లేదు. మరీ ముఖ్యంగా అకస్మాత్తుగా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్ లేదా మూత్ర పిండాల వ్యాధులు కనుగొనేంత వరకూ కనబడటం లేదు. మనం మధుమేహాన్ని నివారించలేము ; అయితే, సరైన జీవనశైలి, ధ్యానం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు’’ అని అన్నారు.
ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఇండియా గ్రూప్ సీఈఓ అనురాగ్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ అంతర్జాతీయంగా 20% మంది హైపర్‌టెన్షన్ బారిన పడేందుకు అవకాశాలుండగా, పలు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో అది 22% నుంచి 27%గా ఉండొచ్చని చెబుతున్నాయి. అది ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్‌లో ప్రస్తుతం 40% మంది హైపర్‌టెన్షన్ బారిన పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యయనం చూపుతున్న దాని ప్రకారం 70% మంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లును అనుసరిస్తుంటే, 70% మంది అధిక బరువు/ఊబకాయులుగా ఉన్నారు. అంటే మహ మ్మారి సమయంలో అసాధారణంగా ఇక్కడ ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చింది. దీర్ఘకాలంలో మేము ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామో దానికి ఇది కేవలం ప్రాథమికమైనది. రాబోయే నెలల్లో, ఈ అధ్యయనాన్ని దగ్గరలోని ప్రాంతాలు, జిల్లాలకు సైతం విస్తరించడం ద్వారా హైపర్ టెన్షన్ పట్ల అవగాహనను భారీ స్థాయిలో కల్పించడానికి ప్రయత్నంచనున్నాము’’ అని అన్నారు. (Story: అలెర్ట్: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్!)
See Also:
దుమ్మురేపిన వరలక్ష్మి! వీడియో
నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన
పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!
అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk