Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ

పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ

పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ

పోస్టర్లను ఆవిష్కరించిన విద్యావంతుల వేదిక

న్యూస్ తెలుగు/వినుకొండ  : 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న బాలికలకు అనంతరం విద్యా లక్ష్యాల సాధనపై దిశా నిర్దేశం చేసేందుకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గుంటూరులో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వినుకొండ విద్యావంతుల వేదిక సీనియర్ న్యాయవాదులు పి.జె. లూకా, సి.హెచ్. మూర్తి తెలిపారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
ఈ శిక్షణా శిబిరంలో యోగా, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ (చక్కగా మాట్లాడటం, సరిగ్గా చూడటం, వినడం, ఆలోచించడం) తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వినుకొండ విద్యావంతుల వేదిక సభ్యులు లాయర్ విజయ్, కూచి రామాంజనేయులు, సుధాకర్ రెడ్డి, ఎం.ఏ. సాలార్, తదితరులు పాల్గొన్నారు.(Story : పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!