పరీక్షల సమయంలో కంటి సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పరీక్షల సమయంలో మెరుగైన ప్రదర్శన కోసం కంటికి సంబంధించి మెరుగైన ఆరోగ్య పద్ధతులను పాటించండి
20-20-20 సూత్రాన్ని అనుసరించండి – ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరాన్ని 20 సెకన్లపాటు చూడండి
– డా|| గౌర చట్టన్నావర్, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్, ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ
బోర్డు పరీక్షలు దగ్గరకు వచ్చేసాయి. పరీక్షల ఆందోళన కారణంగా విద్యార్థులు తరచుగా
నిస్సత్తువతో, అలసిపోయి, అశాంతికి గురవుతుంటారు. సంవత్సరంలోని ముఖ్యమైన నెలలలో తల్లితండ్రులు కూడా అంతే స్థాయిలో భయపడుతూ ఉంటారు. సమయం తక్కువ ఉండడం సాధించవలసింది చాలా ఉండడంతో పిల్లలను ఎక్కువ సమయం పాటు చదివేందుకు పురికొల్పుతుంది.
ఎక్కువసేపు దగ్గరగా పెట్టుకుని పనిచేయడం, నిద్రలేమి, తరచుగా కనురెప్పలను ఆర్పకపోవడం మరియు పెరిగిన స్క్రీన్ సమయంతోకూడిన సుదీర్ఘమైన అధ్యయన సమయాలు కళ్ళ అలసట, పొడిబారడం మరియు దురదకు కారణమవుతాయి. ఇది అసౌకర్యానికి, తలనొప్పులు, చూపు చెదరడం, మరియు కొన్నిసార్లు అది మైగ్రేనుకు కూడా దారితీస్తుంది. ఈ లక్షణాలు కీలకమైన అధ్యయన సమయంలో వారి సమర్ధతను తగ్గిస్తుంది. దృష్టి వైకల్యమున్న పిల్లలలో అధ్యయన సమయం మరింత ఎక్కువగా ఉండవచ్చుకూడా. విద్యార్ధులలో మంచి కంటి ఆరోగ్యం ఉండేటట్లు చూడటం విద్యార్ధులు, తల్లితండ్రులు, అధ్యాపకులు, మరియు వైద్యుల సమిష్టి బాధ్యత.
ఎంతో కీలకమైన ఈ సమయాలలో కంటి శ్రమను నివారించడానికి మరియు సమర్ధతను పెంచడానికి ఈ క్రింది జాగ్రత్త చర్యలు విద్యార్ధులకు ఒక ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన అధ్యయన సమయ అనుభవాన్ని ఇవ్వగలదు.
సమగ్రమైన కంటి పరీక్ష చేయించుకోవడం : కళ్ళద్దాల పవర్‌లో ఏదైనా మార్పుని (కళ్ళద్దాలను వాడుతున్నవారికి) మరియు కంటి పవర్‌లో వస్తున్న మార్పును కనిపెట్టడానికి చదువు ప్రారంభించే ముందుగా ఒక కంటి వైద్యుడు (ఆఫ్థల్మాలజిస్టు)తో కంటిపరీక్ష చేయించుకోవడం మంచిది. తప్పు పవర్ ఉన్న కళ్ళద్దాలు పెట్టుకోవడం అనవసరమైన కంటి అలసటకు కారణమవుతుంది.
20-20-20 నిబంధన పాటించడం : ఎక్కువసేపు కంటికి దగ్గర పెట్టుకుని పనిచేయడం కారణంగా వచ్చే అనవసరమైన అసౌకర్యాన్ని నివారించడానికి అధ్యయన సమయంలో తరచుగా విరామం తీసుకోవడం మంచిది. 20-20-20 నిబంధన పాటించండి : అంటే ప్రతి 20 నిమిషాలకు – 20 అడుగుల దూరం / కిటికీ బయటికి – దగ్గరి పనులకు పనిచేస్తున్న కంటి నరాలు అవసరమైనంత విరామం పొందడానికి దగ్గరనుంచి దూరానికి దృష్టి కేంద్రీకరణను మార్చడానికి 20 సెకన్ల పాటు చూడండి.
తరచుగా కనురెప్పలు ఆర్పడం : సుదీర్ఘమైన అధ్యయన సమయాలలో కళ్ళు ఆర్పకపోవడం తరచుగా జరుగుతుంది. తరచుగా కళ్ళను ఆర్పడం మరిచిపోవద్దు. దాని వలన కళ్లు పొడిబారడం, దురద మరియు కంటి అలసటను నివారిస్తుంది.
సరైన భంగిమ : కూర్చునే భంగిమ మరియు చదివే దూరం సరిగ్గా ఉంచడం మెడ మరియు వెన్ను నొప్పిని నివారిస్తుంది. విద్యార్ధులు తమ వెన్నెముకను నిటారుగా ఉంచే మరియు అతిగా మెడ వంచకుండా ఉండే అలవాటు చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి.
డిజిటల్ గాడ్జెట్ల ఉపయోగాన్ని పరిమితం చేయడం : వీలైనంతవరకూ డిజిటల్ గాడ్జెట్లను పరిమితంగా ఉపయోగించాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. అనివార్యమైన కేసులలో, సెల్ ఫోన్ల బదులు కంటి స్థాయిలో పెద్ద స్క్రీన్లను ఉపయోగించండి మరియు రెండు అడుగులకన్నా ఎక్కువ దూరం నుంచి వాటిని చూడండి. యాంటీగ్లేర్ మరియు యాంటీ-రిఫ్లెక్టివ్ స్క్రీన్లవంటి స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడండి, మరియు చూడడానికి సౌకర్యవంతమైన స్థాయిలకు స్క్రీన్ యొక్క వెలుగును సరిచేయండి.
ఎయిర్ కండిషనర్/కూలర్ లేదా ఫ్యాన్‌కు ముందు ఎదురుగా కూర్చోవద్దు : కళ్ళు పొడిబారడాన్ని తప్పించడానికి ఎయిర్ కండిషనర్ లేదా ఎయిర్ కూలర్ లేదా ఫాన్ ముందు నేరుగా కూర్చోవద్దు. ఈ చర్యలు పాటించడం వలన పొడి కళ్ళ లక్షణాలను తగ్గుతాయి. తీవ్రమైన స్థితిలో లూబ్రికేట్ కంటి మందుచుక్కలు అవసరం కావచ్చు.
మంచి వెలుతురున్న మరియు గాలి ప్రసరిస్తున్న గదిలో కూర్చోండి : గదిలోని కాంతికూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్ధులు చదువుకునే గది ఉల్లాసకరంగా, పరధ్యానం లేకుండా, సరైన గాలి ప్రసరణ మరియు మంచి వెలుతురుతో ఉండాలి. గదిలో తక్కువ మోతాదులోని వెలుతురు కంటికి అనవసరమైన అలసటను కలిగిస్తుంది మరియు కళ్ళకు హానిచేస్తుంది. అతి ప్రకాశవంతమైన వెలుతురు మిరుమిట్లుగొలుపుతుంది, అతి తక్కువ కాంతి కళ్లకు మరింత శ్రమ కలిగిస్తుంది. సహజమైన వెలుతురు మరియు అన్నివైపుల నుండి కాంతి ప్రసారమయ్యేలా చేయడం (నీడ పడకుండా) సిఫార్సు చేయడమైనది.
కనీసం ఒక గంట శారీరిక శ్రమ : విధ్యార్దులు సమగ్ర శ్రేయస్సు మరియు విశ్రాంతి కోసం ప్రతిరోజూ కనీసం ఒక గంట శారీరిక శ్రమ లేదా విశ్రాంతి సమయంలో గడిపేలా ప్రోత్సహించాలి.
ఆరోగ్యకరమైన నిద్రా విధానాన్ని అనుసరించండి : రాత్రి చాలా పొద్దుపోయే వరకూ చదవడం మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అతిగా వాడకం సిర్కాడియన్ రిథమ్ (వెలుతురు, చీకటి వలన శరీరంలో 24 గంటల్లో శారీరకంగా మానసికంగా మరియు ప్రవర్తన పరంగా జరిగే మార్పులు) కు కారణమయ్యే రక్తంలో మెలాటోనిన్ స్థాయిలలో మార్పుకు దారితీస్తాయి. సిర్కాడియన్ రిథమ్‌లో ఏదైనా మార్పు సక్రమంగా లేని నిద్రా విధానాల వలన ఆందోళన మరియు ఒత్తిడివంటి ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుంది. విద్యార్ధులు ప్రతిరోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్ర పోయేటట్లు వారిని ప్రోత్సహించాలి.
హైడ్రేటెడ్ ఉండటం : వీటన్నిటితోపాటు వేసవి కాలంలో డీహైడ్రేషన్, అసౌకర్యం మరియు మైగ్రేనుకుకూడా దారితీస్తుంది. పైవాటితోపాటు హైడ్రేషన్ నిర్వహించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యంత కీలకం.
ఒత్తిడితో కూడిన ఈ పరీక్షా కాలపు సమయంలో విద్యార్ధులకు ఆరోగ్యవంతమైన పరిసరాలను మరియు మానసికంగా మద్దతును అందిద్దాము. (Story: పరీక్షల సమయంలో కంటి సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!)
See Also:
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఏపీ జనానికి షాక్…భారీగా ఆర్టీసీ వాత!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
దేవుడా! ఇదేం ఖర్మ! తిరుపతిలో నరకయాతన
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్