ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!
అకౌంట్లలో సున్నా బ్యాలెన్స్ చూసి కంగుతిన్న ఏపీ సర్పంచులు
జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రెసిడెంట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్న అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులకు జగన్ ప్రభుత్వ ఉగాది పంచ్ విసిరింది. ఉగాదికి ముందు రోజు ఏపీ పంచాయతీ అకౌంట్లలో నిధులు ఉన్నట్టుండి మాయమయ్యాయి. అకౌంట్లలో సున్నా బ్యాలెన్స్ చూసి ఏపీ సర్పంచులు కంగుతిన్నారు. ఖాతాలో రూపాయి కూడా లేకపోవడంతో జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్ అకౌంట్లలో నిధులను ఏపీ ప్రభుత్వం లాగేసుకున్నదని, గత రాత్రి ప్రభుత్వం 4 వేల కోట్ల నిధులను వెనక్కి తీసుకుందని పంచాయతీ సర్పంచుల ఛాంబర్ ఆరోపించింది. 12,918 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఏ ఒక్క పంచాయతీని ప్రభుత్వం వదల్లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, నవరత్నాలకు సరిపడా డబ్బులు లేకపోవడం, సాధారణ పాలనా నిర్వహణ ఖర్చులకే డబ్బులు కొరత రావడంతో తమ నిధులు లాగేసుకున్నారని సర్పంచులు ఆవేదన వెలిబుచ్చారు. గతంలో 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు 7,600 కోట్లను కూడా ప్రభుత్వం ఇలాగే లాగేసుకుందని సర్పంచులు గుర్తుచేకశారు. గ్రామాల్లో వసూలు చేసిన ఆస్తి, ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులు కూడా.. జనరల్ ఫండ్స్ నుంచి మింగేస్తే పంచాయతీలు ఎలా బతుకుతాయని వారంటున్నారు. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు మరమ్మతులు చేయించాలన్నా, పాడైన పైపులైన్లు సరి చేయాలన్నా సాధారణ నిధులే పంచాయతీలకు ప్రస్తుతం ఆధారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు మళ్లిస్తే సమస్యలెలా పరిష్కరిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీల ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (సీఎఫ్‌ఎంఎస్) అనుసంధానించాక ఆర్థికశాఖ దయాదాక్షిణ్యాలపై సర్పంచులు, కార్యదర్శులు ఆధారపడుతున్నారు. పంచాయతీల్లో చేసే ప్రతి పనికి సంబంధించి బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాక ఆర్థికశాఖ ఎప్పుడు ఆమోదించి నిధులు విడుదల చేస్తే అప్పుడే తీసుకోవాలి. సీఎఫ్‌ఎంఎస్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు ప్రస్తుతం పెండిరగ్‌లో ఉన్నాయి. వీటి కోసం సర్పంచులు ఎదురు చూస్తున్న దశలో పంచాయతీల్లోని సాధారణ నిధులు ఖాళీ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లోని సాధారణ నిధులు ఎన్ని మళ్లించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఒకడుగు ముందుకేసి పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. త్వరలోనే ఉద్యమిస్తామని, అవసరమైతే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. నిధులు వెంటనే తిరిగి జమ చేయకపోతే ఆందోళన చేసామని తేల్చిచెప్పారు. (Story: ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!)
See Also: ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)