Homeవార్తలుజాతీయంస‌మ్మె స‌క్సెస్సా? ఫెయిలా?

స‌మ్మె స‌క్సెస్సా? ఫెయిలా?

సమ్మె అట్టర్‌ఫ్లాప్‌ అయితే ధరల దంపుడుకే జనం మద్దతు!

న్యూదిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ దిశగా సోమవారంనాడు సార్వత్రిక సమ్మె తొలిరోజు యావత్‌ దేశం స్తంభించిపోతుందని భావించారు. కానీ సమ్మె దాదాపుగా అట్టర్‌ఫ్లాప్‌ అయింద‌ని గోదీ మీడియా చెపుతోంది! జనం నుంచి పెద్దగా స్పందన కన్పించకపోవడం దురదృష్టకరం. పాపం కార్మిక సంఘాలు జనం కోసమే ఈ సమ్మె చేసింది. కానీ జనం మాత్రం ఆదరించలేదు. పైగా వీళ్లకి పనీపాటా లేదంటూ తిట్టుకోవడం విజయవాడ బందరురోడ్డులో అగుపించింది. మోదీ పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరిగినప్పటికీ, ప్రజలు ససేమిరా అన్నారు. అంటే పెరిగిన ధరలకు ప్రజలు మద్దతునిస్తున్నట్లు భావించాలా? ప్రభుత్వ రంగ సంస్థలను ముఖ్యంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేస్తున్నది. అంటే ఈ అమ్మకాలన్నింటికీ ప్రజలు మద్దతునిస్తున్నట్లేనని అనుకోవాలా? గ్రామాల నుంచి పట్టణాల వరకు సమ్మె ఉంటుందని కార్మిక సఘాల ప్రతినిధులు ముందురోజు తెలిపారు. ఈ సమ్మెలో దాదాపు 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని కూడా అన్నారు. ఈ సమ్మెలో రవాణా, బ్యాంకింగ్‌, రైల్వే, విద్యుత్‌తో పాటు కోల్‌, స్టీల్‌, ఆయిల్‌, టెలికాం, పోస్టల్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కాపర్‌, ఇన్సూరెన్స్‌తో పాటు పలు రంగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాల్సి వుంటుంది. సింగరేణి కార్మికులు కూడా పాల్గొనాలి. ఇప్పటికే వీరంతా సమ్మె నోటీస్‌ను కూడా ఇచ్చారు. కానీ పైన పేర్కొన్న అన్ని రంగాల్లోనూ వీరితో పాటు దేశ వ్యాప్తంగా ఆటో రిక్షలు కూడా బంద్‌ కానున్నాయి. కానీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌తో సహా అన్ని నగరాల్లోనూ ఆటోలు తిరుగుతున్నాయి. అంటే సమ్మె విఫలమైనట్లేనని భావించవచ్చు. మోదీకి ప్రజల మద్దతు పూర్తిగా వుందని చెప్పవచ్చు. పెట్రోల్‌ ధరను రూ. 300 చేసినా జనానికి ఫరవాలేదని భావించవచ్చా? ఎల్‌ఐసీతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసినా ప్రజలు కించత్‌ కూడా మాట్లాడరు అనే దానికి ఈ సమ్మె వైఫల్యమే నిదర్శనం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత ప్రజలపై భారం మోపే విధంగా చేస్తుందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఇదివరకే హెచ్చరించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కీరోసిన్‌, సీఎన్‌జీ ధరలను ఒక్క సారిగా పెంచారిన మండిపడ్డారు.
ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వరుసగా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్‌ పరం చేస్తున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తమ నిరసన తెలియజేసినప్పుడే ప్రభుత్వం దిగివస్తుందని, అందుకే రెండు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ వంటి కార్మిక సంఘాలు ప్రజలను కోరాయి. కానీ వారి ఆకాంక్ష బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ప్రజలు పెద్దగా స్పందించలేదు. కాకపోతే, కొన్ని చోట్ల కార్మికులు పెద్దపెద్ద ర్యాలీలు నిర్వహించి, ఆకట్టుకున్నారు. ఎక్కడికక్కడే ఎర్రజెండాలు కన్పించాయి. తొలి రోజు జనం మాట్లాడకపోయినా, మంగళవారం కూడా ఈ సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది కాబట్టి, ప్రజల స్పందన ఎలా వుంటుందో వేచిచూద్దాం. (<¸Š=@‚z|˜Ÿ సమ్మె అట్టర్‌ఫ్లాప్‌! ధరలకే జనం మద్దతు!)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!