మంత్రిపై తేనెటీగల దాడి
భువనగిరి: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. యాదాద్రి నరసింహస్వామి ఆలయం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రిపై అనూహ్యంగా తేనెటీగలు దాడిచేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బంది పైన తేనెటీగలు దాడి చేయడంతో వస్త్రాన్ని కప్పి కొంతమేరకు రక్షించుకోవాల్సి వచ్చింది. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ మహాకుంభ సంప్రోక్షణ పూజాకార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకున్న తర్వాత మంత్రి అజయ్ హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. గత కొన్ని రోజులుగా యాదాద్రిపై ఏదోఒక పూజా కార్యక్రమం జరుగుతూనే వున్నది. అయితే ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. (Story: మంత్రిపై తేనెటీగల దాడి)
See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!