Homeటాప్‌స్టోరీఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

మాస్కో : ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా కచ్చితంగా జీవాయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాల మీడియా సంస్థలు, వాటిని నమ్ముకున్న ఇండియన్‌ మీడియా సంస్థలు ఘోషిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఉక్రెయిన్‌లోనే బయో బాంబ్స్‌ ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రష్యా వెల్లడిరచడం ద్వారా సంచలన ప్రకటన చేసింది. అతిపెద్ద, బలమైన రష్యాతో ఢీ అంటే ఢీ అనడానికి ఉక్రెయిన్‌కు అంత ధైర్యం ఎలా వచ్చింది? అమెరికా, నాటో దేశాల అండదండలతోపాటు జీవాయుధాలు (బయో వెపన్స్‌) కూడా ఉక్రెయిన్‌ వద్ద ఉండటమే అందుకు కారణమని రష్యా చెపుతోంది. ఉక్రెయిన్‌ జీవ ప్రయోగశాలల్లో ప్లేగు, ఆంత్రాక్స్‌తో కూడిన జీవాయుధాల అభివృద్ధి జరుగుతోందని, ఈ తయారీలో అమెరికా ప్రమేయం ఉందని కచ్చితంగా వుందని రష్యన్‌ గూఢచార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో పలు నగరాలను రష్యా ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ జీవాయుధాల తయారీపై అమెరికా స్పష్టత ఇవ్వాలని రష్యా డిమాండు చేసింది. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌, ఇతర రోగకారకాలతో కూడిన బయో బాంబులను ఉక్రెయిన్‌ ల్యాబుల్లో అమెరికా అభివృద్ధి చేస్తుందంటూ రష్యా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా చెప్పారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము ప్రయత్నించడం లేదని, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరిగిన మూడు దశలో చర్చల్లో కొంత పురోగతి ఉందని ఆమె ప్రకటించారు. ఉక్రెయిన్‌లో బయో వెపన్‌లు అమెరికా అభివృద్ధి చేస్తున్నట్లు పత్రపూర్వక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వీటి కోసం అమెరికా రక్షణ శాఖ నిధులు సమకూరుస్తోందన్నారు. బయో వెపన్స్‌ తయారీ గురించి అమెరికా రక్షణ శాఖ, పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరణ ఇవ్వాలని రష్యా డిమాండు చేస్తోందన్నారు. అయితే, బయో ఆయుధాల తయారీ ఆరోపణలను అమెరికా, ఉక్రెయిన్‌ దేశాలు ఖండిరచాయి. సామాన్యులపై మాస్కో దాడులు చేయడం లేదని, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం లక్ష్యం కాదని మారియా జఖరోవా చెప్పారు. ఆ దేశాన్ని డీనాజిఫై చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్‌ వల్లే అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కీవ్‌ అధికారులు ప్రజల తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని జఖరోవా తెలిపారు. మానవతా కారిడార్‌ల గురించిన సమాచారాన్ని కావాలనే ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. (Story: ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?)

See Also: ఆగని యుద్ధం!

See Also: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics