UA-35385725-1 UA-35385725-1

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

తెలంగాణలో ఉద్యోగమేళా!

పూర్తి వివరాలివే!
80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details ! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాస్త ఆలస్యంగానైనా నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడిరచారు. మిగిలిన 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. 95శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్‌ చెప్పారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశాన్నంటుతున్నాయి. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ మానస పుత్రిక అయిన మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైందిలి

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 371- డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. కేంద్రం అనవసర తాత్సారం చేసినా.. స్వయంగా అనేకసార్లు ఢల్లీికి వెళ్ళి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి దీనికున్న ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పారు. దీని కోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢల్లీిలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వల సవరణ సాధ్యమైందన్నారు. ఇది తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం అన్నారు.

గరిష్ఠ వయో పరిమితి పెంపు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జనరల్‌ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ అభ్యర్థులు 49 సం.లు, దివ్యాంగులకు 54సం. వయో పరిమితిగా ఉంటుందని చెప్పారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలివీ..

సీఎం కేసీఆర్‌ ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 3,560, ఎస్సీల అభివృద్ధి శాఖ 2,879, నీటిపారుదల- కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ 2,692, గిరిజన సంక్షేమశాఖ 2,399, మైనార్టీ సంక్షేమశాఖ 1,825, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ 1,455, కార్మిక-ఉపాధి కల్పన శాఖలో 1,221 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

ఆర్థికశాఖలో 1,146 పోస్టులు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ 895, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 859, వ్యవసాయ-సహకార 801, ట్రాన్స్‌పోర్ట్‌- ఆర్‌అండ్‌బీ శాఖ 563, న్యాయశాఖ 386, పశుసంవర్థక, మత్స్యశాఖ 353, సాధారణ పరిపాలన శాఖ 343, పరిశ్రమలు-వాణిజ్యశాఖ 233, యువజన సర్వీసులు-పర్యాటక, సాంస్కృతిక శాఖ 184, ప్రణాళిక శాఖ 136, పౌరసరఫరాల శాఖ 106, లెజిస్లేచర్‌ 25, ఎనర్జీ 16 పోస్టులు.. ఇలా మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్‌ తన ప్రకటనలో వెల్లడిరచారు.

గ్రూప్స్‌.. లోకల్‌ కేడర్‌ వారీగా..

గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌- 4 వరకు భర్తీ చేయనున్న ఖాళీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-1 కింద 503, గ్రూప్‌-2 (582), గ్రూప్‌-3 (1,373), గ్రూప్‌-4 (9,168) పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. లోకల్‌ కేడర్‌ వారీగా పరిశీలిస్తే జిల్లా స్థాయిలో 39,829, జోనల్‌లో 18,866, మల్టీ జోనల్‌లో 13,170, మిగిలిన విభాగాలు, యూనివర్సిటీల్లో 8,174 పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య ఇదీ..

జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడిరచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39,829 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు
గ్రూప్‌ 3 %–% 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్‌ వారీగా ఖాళీలు..
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్‌ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

ఏ శాఖలో ఎన్ని..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్‌- 13,086
హెల్త్‌, మెడికల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌- 12,755
హయ్యర్‌ ఎడ్యుకేషన్‌- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్‌- 2,399
మైనారిటీస్‌ వెల్ఫేర్‌- 1,825
ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్‌ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్‌, ఎంప్లాయీమెంట్‌- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌- 895
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌- 859
అగ్రికల్చర్‌, కో-ఆపరేషన్‌- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌- 343
ఇండస్ట్రీస్‌, కామర్స్‌- 233
యూత్‌, టూరిజం, కల్చర్‌- 184
ప్లానింగ్‌- 136
ఫుడ్‌, సివిల్‌ సప్లయిస్‌- 106
లెజిస్లేచర్‌- 25
ఎనర్జీ- 16

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్‌ %– 5,268
%నిజామాబాద్‌- 1,976
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్‌- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్‌- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్‌- 1,213
ఆదిలాబాద్‌- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్‌- 1,172
హనుమకొండ- 1,157
మెదక్‌- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్‌ భూపాలపల్లి- 918
నిర్మల్‌- 876
వరంగల్‌- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్‌- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్‌- 741
వికారాబాద్‌- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..

కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్‌ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు..

మల్టీజోన్‌ 1- 6,800
మల్టీజోన్‌ 2- 6,370 (Story: తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details)

See Also: చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?
మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1