Home Blog Page 3

27న చలో విజయవాడ ను జయప్రదం చేయండి

0

27న చలో విజయవాడ ను జయప్రదం చేయండి

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనిని జయప్రదం చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ నాయకులు పిలుపు నిచ్చారు. డిపో ఆవరణలోని సంఘ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘ సభ్యులు ఎం.రామసుబ్బయ్య, వి.ఆనందం మాట్లాడుతూ. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్మెంట్ నగదు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుడు మరణిస్తే నామినీగా ఉన్న అతని భార్యకు జీవితాంతం పెన్షన్ చెల్లించాలి. కానీ పుట్టిన తేదీలో మార్పు జరిగిందని, పేరులో కొన్ని అక్షరాలు తేడాగా ఉన్నాయని, అనేక కారణాలు చెప్పి ఆమెకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. అందువలన నిబంధనలను సులభతరం చేసి ఆర్టీసీ రికార్డులను ఆధారం చేసుకుని పెన్షన్ చెల్లించే ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కే.హనుమయ్య, ఎస్.కే.సైదా, కే.మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.(Story : 27న చలో విజయవాడ ను జయప్రదం చేయండి )

గృహనిర్మాణం కోసం అదనపు సహాయం

0

గృహనిర్మాణం కోసం అదనపు సహాయం

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండలంలో పి యం ఏ వై గ్రామీణ స్కీం కింద 448 ఇల్లు మంజూరైనవి మరియు పిఎం జన్మన్ పథకం కింద 185 గృహాలు మంజూరైనవి. పూర్తి కాకుండా వివిధ దశలలో ఉన్నటువంటి గృహాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు సహాయం కింద ఎస్టీలకు 75వేలు పి.వి.టి.జులకు లక్ష రూపాయలు అదునపు సహాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ మంజూరు చేయడమైనది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి హౌసింగ్ చీఫ్ సెక్రటరీ జై జైన్ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ తాత బాయ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు, కలెక్టర్ రంపచోడవరం నియోజకవర్గం శ్రీమతి మిరియాల శిరీష దేవి గృహ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో చింతూరు మండల అధ్యక్షులు ఇల్లా చిన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : గృహనిర్మాణం కోసం అదనపు సహాయం)

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి

0

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా తన విజయపరంపర ఖాతాలో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ న0.30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్ పందెంలో, ప్రతీకూల వాతావరణం మరియు అలవాటు లేని ప్రాంతం లో అనారోగ్యం పాలైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న 80 మంది లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసి పరుగుల వీరుడు గా పేరొందిన షేక్. అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 06 గంటలలో పూర్తిచేసిన విషయం విధితమే, అందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును చేర్చడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈ నెల 29న జరిగే ఎన్ ఈ బి స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే 24 గంటల పరుగు పందెంలో 210 కిలోమీటర్ల ఏ ఎఫ్ ఐ పరుగు పందెంలో పాల్గొనేందుకు ఇండియా రికార్డు కోసం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఆర్థికంగా సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.(Story : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి)

ఫీజు రియింబర్స్ మెంట్  బకాయిలను తక్షణమే విడుదల చేయాలి 

0

ఫీజు రియింబర్స్ మెంట్  బకాయిలను తక్షణమే విడుదల చేయాలి 

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం

వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగురవేసి, కార్యాలయం లో కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న యువత మోసం చేసిందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట లో విద్యార్థులు, నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో 7 నియోజకవర్గాల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీ గా వెళ్లి కలెక్టర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యులు బొల్లా మాట్లాడుతూ. అధికారం లోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం కావస్తున్న ఎన్నికల మేనిపెస్టో లో పెట్టిన ఏఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పేద విద్యార్థులు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించేందుకు దివంగత నేత వై యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వవలసిన 4.600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని డిమేండ్ చేశారు. ఎన్నికల మేనిపెస్టో లో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3 వేలు రూపాయలు భృతి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం లో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఉపసంహారించుకోవాలన్నారు . ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున యువత, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ఫీజు రియింబర్స్ మెంట్  బకాయిలను తక్షణమే విడుదల చేయాలి )

ఘనంగా నిర్వహించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

ఘనంగా నిర్వహించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : మాజీ ఎమ్మెల్యే బొల్లా అసమ్మతి వర్గం.. చుండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో బుధవారం చెక్ పోస్ట్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహం వద్ద వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2029 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. అధికార పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పరిపాలన వదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నుండి నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగిన ఏ కార్యక్రమంలో నైనా అందరిని సమాన గౌరవం ఉంటుందని ,ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. నియోజకవర్గంలో నియంతృత్వ పాలన ఇక చెల్లదని హెచ్చరించారు. ఇకపై ఎటువంటి పార్టీ కార్యక్రమాలు జరిగినా సమిష్టి చర్చ అనంతరం మాత్రమే జరుగుతాయన్నారు. నేటి రాజకీయంలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, డబ్బుతో అభిమానాన్ని ఉండలేరని అన్నారు. డబ్బు అవసరాలకు మాత్రమే పనికి వస్తుంది కానీ డబ్బుతో అన్ని కొనలేమన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. చివరిగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుండూరి వెంకటేశ్వర్లు, నక్క నాగిరెడ్డి, గోనుగుంట్ల హనుమయ్య, న్యాయవాది చింతలచెరువు వెంకి రెడ్డి, బుచ్చయ్య చౌదరి, గుండాల స్వెనోము, పొట్లపల్లి అవినాష్ రెడ్డి, నరాల శెట్టి శ్రీనివాసరావు, ఐరామూర్తి, దగ్గుపాటి మూర్తయ్య, జక్కిరెడ్డి సుబ్బారెడ్డి, బాబు, పొట్లపల్లి పిచ్చిరెడ్డి, పారా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : ఘనంగా నిర్వహించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు )

ఇంటింటికీ మంచినీరు, టి‌డ్కో ఇళ్ల పూర్తికి జీవీ విజ్ఞప్తి

0

ఇంటింటికీ మంచినీరు, టి‌డ్కో ఇళ్ల పూర్తికి జీవీ విజ్ఞప్తి

అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ :గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం సహకారంతో ప్రారంభించి, జగన్ ప్రభుత్వం ఆగిపోయిన మంచినీటి పథకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణకు – ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోనే వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట సహా అనేక పట్టణప్రాంతాలు వాటి పూర్తి కోసం ఎదురు చూస్తున్నాయని, వేగంగా చర్యలు తీసు కోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సహకారంతో సీఎం చంద్రబాబు అమృత్‌ పథకం తీసుకుని వచ్చారన్నారు. ఆ పథకం కింద 8వేల 500 కోట్లు మంజూరయ్యాయ ని, కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం ఇస్తే ఆ పథకం పూర్తి అవుతుందని తెలిపారు. అలాంటిది కేంద్రం రూ.600కోట్లు ఇచ్చినా జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వక ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వంలోనైనా వాటిని పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అమృత్‌ పథకం ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతో పాటు టిడ్కో ఇళ్లకు అలానే చేశారన్నారు. కనీసం 10శాతం పనులు కూడా చేయకుండా పాడుపెట్టారని.. వాటికి మోక్షం కల్పించాలని కోరా రు. ఈ ప్రశ్నకు స్పందించిన మంత్రి నారాయణ టిడ్కో ఇల్లు, అమృత్‌స్కీమ్ త్వరలోనే పూ్తి చేస్తామని తెలిపారు. ప్రతిఇంటికి, ప్రతి వ్యక్తికి 135లీటర్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడేళ్లలో అవన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. (Story : ఇంటింటికీ మంచినీరు, టి‌డ్కో ఇళ్ల పూర్తికి జీవీ విజ్ఞప్తి)

వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు

0

వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు

శాసనసభలో మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : మహాభారతంలో ఒకడే కీచకుడు ఉంటే… వైకాపా పాలనలో మాత్రం రాష్ట్రంలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడని, వారిపై నేరాల్లో రాష్ట్రాన్ని తలవంచుకునే పరిస్థితుల్లో నిలబెట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. ఎక్కడ మహిళలు గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువుదీరతారని చంద్రబాబు నమ్మితే.. ఆ మాటకు అర్థం లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. బుధవార ఈ మేరకు శాసనసభలో మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ అయిదేళ్ల వైకాపా పాలనలో మహిళలకు చేసిన అన్యాయాలపై నిప్పులు చెరిగారు. మొదట్నుంచి మహిళా పక్షపాతిగా ఉన్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో వారి దశ మార్చితే జగన్ వారిని రోడ్లపాలు చేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రూ.18వేల కోట్లు పసుపుకుంకుమ కింద ఇస్తే జగన్ కల్తీ మద్యంతో 30వేలమంది అక్కచెల్లెమ్మల తాలిబొట్లు తెంచారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజా యి, డ్రగ్స్‌కు నిలయంగా చేసి పట్టపగలు కూడా ఆడవారి రోడ్లపై తిరగలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. వైకాపా పాలనలో 250మంది ఎస్సీ మహిళలు,ఎస్టీ ఆడబిడ్డలు 2వేల 27 హత్యకు గురయ్యారన్నారు. మహిళలపై 2లక్షల 4వేల 414 నేరాలు జరిగాయని, ఒక్కమాట లో చెప్పాలంటే గడిచిన అయిదేళ్లు రాష్ట్రంలో పరిస్థితి తాలిబన్ల పాలన కంటే ఘోరంగా తయారు చేశారని మండిపడ్డారు. సుమారు 4వేల34 అత్యాచారాలు జరిగాయని, 22వేల 272 మంది మహిళలు అదృశ్యమయ్యారని, అయినా వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. వినుకొండలో 70ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం జరిగితే వైకాపా కార్యకర్తలు చేశారని కేసునే తొక్కిపెట్టేశారని చర్యలు లేకపోతే భయం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. జగన్ తీరుతో మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్లీ మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారని. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాల తో సాధికారితకు బాటలు వేసుకుంటున్నారని తెలిపారు. ఆమేరకు శాంతిభద్రతలు పూర్తిస్థాయి లో మెరుగు పరిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. (Story : వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు)

వినుకొండ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది..

0

వినుకొండ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది..

న్యూస్ తెలుగు /వినుకొండ : వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెండుగా గ్రూపులుగా చీలిపోయి.. కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వంలో ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవం జరపగా అందుకు పోటీగా బొల్లా ను వ్యతిరేకించే మరికొందరు ముఖ్య నేతలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. కార్యకర్తలకు ఎవరు అండగా ఉంటారు వారే నాయకులు అవుతారని నాయకత్వానికి డబ్బు కాదని ఈ సందర్భంగా బొల్లా నుద్దేశించి విమర్శలు చేశారు. ఇప్పటికే బొల్లా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన వ్యతిరేక వర్గం ఆవిర్భావ దినోత్సవం రోజున పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి వర్గపోరును భహిర్గతం చేసింది బొల్లా బ్రహ్మనాయుడు నిర్వహించే కార్యక్రమానికి మీరంతా దూరంగా ఉండటం తోపాటు వారే పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం వైసిపిలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని ఆ పార్టీలో దుమారం రేగుతుంది ఇంకా రానున్న రోజుల్లో బ్రహ్మనాయుడు కి వ్యతిరేకంగా మరికొందరు నేతలు కూడా చుండూరి వర్గంలో చేరి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తారన్న ప్రచారం కూడా ఊపు అందుకుంది. అయితే వీటన్నింటిని బొల్లా వర్గం కొట్టి పారేస్తుంది రాజకీయ పార్టీ కార్యకలాపాలు నడపాలంటే ఆర్థిక బలం అవసరమని ఆర్థిక బలం ఉన్న నాయకుడు బొల్లా అని వారు పోటీ కార్యక్రమం పట్ల చులకనగా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా వినుకొండలో ఘోర పరాజయం పాలైన వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ మనుగడ ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సారించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (Story : వినుకొండ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది..)

చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్

0

చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు ఐ టి డి ఏ ఆఫీస్ ముందు పి ఓ అపూర్వ భరత్ చలి వేంద్రాన్ని ప్రారంభించారు.మన్యం కవి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వరదసహాయక కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న యువ కవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అధ్యాపకునిగా పనిచేస్తున్న నూనె రమేష్ స్థానిక ఐ టి డి ఎ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఏర్పాటు చేశారు . ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నూనె రమేష్ ను అభినందించారు. ఈ చలివేంద్రం ద్వారా నీరు అందించడం తో పాటు పర్యావారణాన్ని కాపాడమని, చెట్లను నరకొద్దు అని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మొలించాలని ప్రచారం చేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యమని నూనె రమేష్ తెలియజేసారు. విద్యార్థులలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత పెంపొందించేలా విద్యార్థులను ఈ చలివేంద్రం నిర్వహణలో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఐ టి డి ఎ సిబ్బంది స్థానిక మీడియా మిత్రులు, విద్యార్థులు వేముల చిరంజీవి, ముర్రం సురేష్, బంధం ప్రశాంత్, రవ్వ లక్ష్మణ్, మడకం మానస, సున్నం మత్తేశ్వరి, తుష్టి రాధ, ముర్రం సుబ్బలక్ష్మి, కిలో సాయి దుర్గ, కొవ్వాసి రజిత తదితరులు పాల్గొన్నారు. (Story : చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్)

వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

0

 వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు /సాలూరు : సంక్షేమం అభివృద్ధి కి పెద్ద పీట వేసి జనం కోసం అజెండాగా జనమే జెండాగా అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం బోసు బొమ్మ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసే మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత పుట్టి 14 వసంతాలు పూర్తిచేసుకుని ఎన్నో ఆటుపోట్లకు కష్ట నష్టాలు ఎదుర్కొనే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో సంక్షేమం అభివృద్ధి కి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. జనం కోసం ఎజెండాగా జనమే జెండాగా అన్ని వర్గాల ప్రజల మన్నన పొంది, ప్రజల నమ్మకం విశ్వాసం కలిగిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పారు..వైఎస్ఆర్సిపి పార్టీ అంటే పేదల పార్టీ ఆని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైయస్సార్ పార్టీ అని అన్నారు. అదేవిధంగ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వైసిపి కార్యకర్తలు కార్యకర్తలు నాయకులు కు ఏ పని చేయవద్దని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి సూపర్ సెక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసిడని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అనార్హుడనీ అని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు. వేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని అన్నారు. మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకు చదువుకోడానికి సీట్లు ఇవ్వకుండా ఈ కుటమీ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, దండి శ్రీనివాసరావు, పిరిడి రామకృష్ణ, తాడ్డి శంకరరావు, కొల్లి వెంకటరమణ, మేకల శంకర్రావు, జన్ని సీతారాం వైయస్సార్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు)

error: Content is protected !!