వరద బాధితులకు 500 ప్యాకెట్ల బియ్యం తరలింపు
బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య
న్యూ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో విజయవాడ వాసులు కష్టాలను ఎదుర్కొంటూ జీవనం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో వందలాదిమంది వ్యాపారస్తులు, ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య ఆధ్వర్యంలో 500 ప్యాకెట్ల బియ్యమును అమరావతికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ బియ్యాన్ని విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు ఈనెల 11వ తేదీ బుధవారం చెన్నకేశవపురం మేడాపురం క్రాస్ నందు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండి వెంకటేశు, కార్యదర్శి జంగమన్న, కోశాధికారి కొండయ్య, సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు, ఉపాధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. (Story : వరద బాధితులకు 500 ప్యాకెట్ల బియ్యం తరలింపు)