పల్లె దవాఖాన రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /రోహిర్ / (ములుగు ) : రోహిర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) కు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఆలెం అప్పయ్య తో కలిసి ఏటూరు నాగారం మండలం లోని రోహిర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్లె దవాఖానకు రహదారి సౌకర్యము లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, దానిని గమనించి కలెక్టర్ వారం రోజులలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని మరియు నిరంతర విద్యుత్ సౌకర్యము ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమలత , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : పల్లె దవాఖాన రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్)