బ్లడ్ క్యాన్సర్ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను అందించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):ధర్మవరం పట్టణానికి చెందిన కె. రవికుమార్ అనే వ్యక్తి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్య కుమార్ వెంటనే స్పందించి, రవికుమార్‌కు అత్యుత్తమ వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు తిరుపతిలోని స్విమ్స్ క్యాన్సర్ హాస్పిటల్‌లో 10 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తదుపరి ధర్మారం నుండి తిరుపతికి మంత్రి కార్యాలయ సిబ్బంది స్విమ్స్ క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి, రవికుమార్ యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్‌లో ఆయన ఆరోగ్య నిపుణులు, చికిత్స ప్రగతిని వివరించారు. రవికుమార్ యొక్క పరిస్థితి స్థిరంగా ఉందని తెలియజేశారు.అతనికి అందిస్తున్న ట్రీట్మెంట్ శ్రేయోభిలాషతో సంతృప్తి పొందిన రవికుమార్ యొక్క కుటుంబ సభ్యులు,మంత్రికు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సపోర్ట్ ద్వారా, రవికుమార్ యొక్క ఆరోగ్యానికి మంచి పరిణామాలు సాధించగలిగే ఆశ కలుగుతోందని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.(Story:బ్లడ్ క్యాన్సర్ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను అందించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.)