వెలుతురు రావాలి, న్యాయం జరగాలి
పి ఎస్ యు- ప్రగతిశీల విద్యార్థి సంఘాల డిమాండ్
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి అతి క్రూరంగా దాడి చేసి హత్య చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని పిడిఎస్యు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం పిఎస్యు ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ టూటూరియల్స్ నందు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ధర్మవరం అధ్యక్షులు నందకిషోర్ మాట్లాడుతూ …….
కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడి చాల బాధాకరం అని ఆవేద వ్యక్తం చేశారు.మనకు, తెలిసినట్లుగా, సుప్రీంకోర్టులో తదుపరి విచారణ 5 సెప్టెంబర్ 2024న జరుగుతుంది. అందరి దృష్టి ఆ రోజు కోర్టు నిర్ణయంపైనే ఉంటుంది మరియు అభయ కూడా చూస్తుంది. ఆర్ జి కర్ నుండి బద్లాపూర్ వరకు, ఫరూఖాబాద్ నుండి మణిపూర్ వరకు మన దేశాన్ని గాయపరిచే లైంగిక వేధింపులు మరియు అత్యాచారాల యొక్క భయంకరమైన నేరాలకు వ్యతిరేకంగా మనం ఏకం కావాలని పిలుపునిచ్చారు. సత్వర న్యాయం మరియు మహిళలందరికీ సురక్షితమైన భవిష్యత్తును కోరుతూ మన గళాలు ఐక్యంగా లేవనివ్వండి అని వెలుగెత్తి చాటారు. .చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు మహిళలకు ఇంట బయట రక్షణ లేదని ఇందుకు నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలో మైనర్ బాలురు మైనర్ బాలికపై చేసిన అత్యాచారం, కలకత్తాలో మెడికల్ విధ్యార్థినిపై జరిగిన అత్యాచారాలు నిదర్శణం అని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యలో నిందితుడు ఒక్కరే కాదు అనేకమంది ఉన్నట్లుగా ఆమె పోస్ట్మార్టం రిపోర్టులో స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. కానీ సంఘటన స్థలానికి చేరిన పోలీసులు అర్జీ కార్ ప్రిన్సిపల్ ఆమెది ఆత్మహత్య అని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుందని అన్నారు. కావున జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యలో కీలక వ్యక్తులు ఉన్నారని అనుమానం దేశ ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉంటూ, మహిళలకు అన్యాయం జరిగితే ఇంతవరకు నిందితులను పట్టుకోలేని స్థితిలో ఉండటం చాలా దుర్మార్గమని వారు వాపోయారు.జూనియర్ డాక్టర్ కేసును సిబిఐ కు బదిలీ చేసి చేతులెదులుకోకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కేసు బాధితురాలకి న్యాయం చేయాలని,అదేవిధంగా జూనియర్ డాక్టర్ అతి కిరాతకంగా అత్యాచారం అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన ప్రజాసంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన త్రీవతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు హరి, వేణు,అశోక్, వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story : వెలుతురు రావాలి, న్యాయం జరగాలి)