చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి
హ్యాండ్లూమ్స్ ఏడి రమేష్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్య సాయి జిల్లాలోని చేనేత కార్మికులకు మాస్టర్ వీవర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త చేనేత పట్టు సహకార సంఘాల ఏర్పాటుకు అనుమతి లభించిందని హ్యాండ్లూమ్స్ ఏడి రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గల 50 మంది చేనేత అండ్ పట్టు కార్మికులతో గ్రామీణ ప్రాంతములలో చుట్టుపక్కల 50 మంది కంటే తక్కువ ఉన్నచో కనీస 30 మంది చేనేత, పట్టు కార్మికులతో ఒక కొత్త చేనేత పట్టు సహకార సంఘమును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అందువలన సంఘ సభ్యులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను రాష్ట్ర జాతీయస్థాయి ఎగ్జిబిషన్ అనగా వస్త్ర ప్రదర్శనలో అమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆప్కో ఇతర ప్రభుత్వ సంస్థల నుండి ఆర్డర్లు పొందే అవకాశం కలదని చేనేత పట్టు కార్మికుల శేరు ధనముగా ఒక్కొక్కరు రూ.1000 చొప్పున సంఘం సభ్యత రుసుమును చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని సంఘ పెట్టుబడిగా ఆయా మండలాలలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు జమ చేయడం జరుగుతుందన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వ వాటా ఇతర ప్రభుత్వ పథకముల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. మన ధర్మవరం పట్టు చీరలకు భౌగోళిక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. వీటిని ఉత్పత్తి చేయువారు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ధర్మవరం పట్టుచీరలు ఉత్పత్తి చేయువారు దరఖాస్తు చేసుకోవలసినదిగా వారు తెలిపారు. కావున జిల్లాలోని చేనేత కార్మికులు కొత్త సంఘం ఏర్పాటు ప్రతిపాదనలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని దిగిన జనార్ధారణ కాంప్లెక్స్ వెస్ట్ గేటు దగ్గర ఉన్న జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి వారి కార్యాలయమునకు అందజేయాలని తెలిపారు. (Story : చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి )