‘మ్యూజిక్ స్కూల్’లో 11 పాటలు!
ఇళయరాజా సంగీతం అందిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా మూడో షెడ్యూల్ పూర్తి….
– 11లో 10 పాటల చిత్రీకరణ పూర్తి!
‘మ్యూజిక్ స్కూల్’లో 11 పాటలు! ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న మ్యూజికల్ స్కూల్ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 45రోజుల షెడ్యూల్‌లో 10 పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. ఇంకో పాట చిత్రీకరణ మిగిలింది. చిన్ని ప్రకాష్, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్ ఆడం ముర్రే నృత్య దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మ్యూజికల్ సినిమాను ఇవ్వాలన్న ఆకాంక్షతో మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
శ్రియా శరణ్ మాట్లాడుతూ ”అమేజింగ్ షూట్ కంప్లీట్ చేశాం. వి లవ్ యూ కిరణ్ సార్. చిన్ని ప్రకాష్ సార్, రాజు మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బావుంది. షర్మన్‌తోనూ, పలువురు చైల్డ్ ఆర్టిస్టులతోనూ షూటింగ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నందుకు పాపారావు సార్‌కి ధన్యవాదాలు” అని అన్నారు.
షర్మన్ జోషి మాట్లాడుతూ ”మ్యూజిక్ స్కూల్ మూడో షెడ్యూల్ పూర్తయింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేసిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్ లు పూర్తి చేశాం. రావుగారి టీమ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. ప్రతి విభాగంలోనూ ఎక్సలెన్స్ కోసం పాటుపడుతూ ముందుకు సాగుతుంటే ఆనందంగా ఉంది” అని అన్నారు.
దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ”నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా పిల్లలు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బెటర్ ఔట్‌పుట్ కోసం నేను ప్రత్యేకించి ఎవరినీ అడగలేదు. అందరూ అంతగా ఇన్వాల్వ్ అయి చేశారు. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మేం అనుకున్న టైమ్ ప్రకారం సినిమా పూర్తవుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహాన్స్ మాట్లాడుతూ ”45 రోజుల అద్భుతమైన షెడ్యూల్‌ని పూర్తి చేశాం. యామిని ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. శ్రియా శరణ్, షర్మన్ జోషీ, ప్రకాష్‌రాజ్‌గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా స్మూత్‌గా పనిచేశాం. థాంక్స్ టు యామిని ఫిల్మ్స్ ” అని అన్నారు.
రాజు సుందరం మాట్లాడుతూ ”ప్రతిభావంతులైన చిన్నారులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాపారావు సార్‌కి, కిరణ్‌కి ధన్యవాదాలు” అని అన్నారు.
యామిని ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. పాపారావు బియ్యాల స్క్రిప్ట్ రాసి, దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, తెలుగులో ఈ మ్యూజిక్ స్కూల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిరణ్ డియోహాన్స్ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.
షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్, బెంజమిన్ జిలానీ, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా మోనా అంబేగవోంకార్, గ్రేసీ గోస్వామీ, ఓజు బారువా, బగ్స్ భార్గవ, మంగళ భట్, ఫణి ఎగ్గోటి, వాక్వర్ షేక్, ప్రవీణ్ గోయెల్, రజ్‌నీష్, కార్తికేయ, రోహన్ రాయ్, ఒలివియా చరణ్, వివాన్ జైన్, సిదీక్ష, ఆద్య, ఖుషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (Story: ‘మ్యూజిక్ స్కూల్’లో 11 పాటలు!)