క్రిటికల్ కేర్ సెంటర్ నూతన నిర్మాణాల పై అసహన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణాలు చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ కేంద్ర నిర్మాణాలను ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరిశీలించారు. వరదకు అడ్డంగా చేపట్టిన నిర్మాణాలు వాగు లెవల్ కంటే కిందకి ఉండడంతో వర్షపు నీరు పూర్తిగా క్రిటికల్ కేర్ సెంటర్లోకి వస్తుందని వర్షపు నీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణాలలో వాడే సిమెంటు ఇసుకలు తదితరాలు నాణ్యవంతంగా ఉండాలని క్వాలిటీ కంట్రోలర్తో ఒకసారి పరీక్షలు చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాల్లో క్వాలిటీ లేదని తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుందామని ముందుగా క్వాలిటీ పై తగు పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా రోగులకు రక్త పరీక్షలు చేసేందుకు అధునాతనంగా ఏర్పాటుచేసిన టీ హబ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. టీ హబ్ లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఏ ఒక్కరు కూడా లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాదిమంది నిరుపేదలు ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకునే అతి ముఖ్యమైన హబ్ లోనే విధి నిర్వహణలోపం ఉందని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ గారికి సూచించారు (Story : క్రిటికల్ కేర్ సెంటర్ నూతన నిర్మాణాల పై అసహన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే)