తమ్మిలేరు జలాశయం నుండి 9వేల క్యూస్షన్ నీటి విడుదల
న్యూస్ తెలుగు/ చాట్రాయి : చాట్రాయి చింతలపూడి మండలాల నడుమ ఉన్న మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు రెగ్యులేటర్ నుండి 9వేల302 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ పరమానందం తెలిపారు. ఆంద్రా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వలన చాట్రాయి మండలం చిన్నంపేట చింతలపూడి మండలం శివపురం గ్రామాల నడుమ ఉన్న తమ్మిలేరు కాజ్వే మునిగిపోవడం తమ్మిలేరుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంపై ఏఈ పరమానందం వివరణ కోరగా. ఆదివారం సాయంత్రం తమ్మిలేరు జలాశయం నీటిమట్టం 348.44 అడుగులు ఉండగా ఇన్ఫ్లో పదివేల280 క్యూస్కులు వస్తుందని 9302 క్యూస్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. తమ్మిలేరు దిగువ ప్రాంతంలో జిల్లా కేంద్రమయిన ఏలూరు పట్టణం ఉన్నందున ఉన్నతాదికారులతో చర్చిస్తూ అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. (story :తమ్మిలేరు జలాశయం నుండి 9వేల క్యూస్షన్ నీటి విడుదల)