హాకీ మాంత్రికుడైన ధ్యాన్చంద్ యావత్ దేశం గుర్తించుకోవాలి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డు నందు గల మహాత్మ జ్యోతిరావు పూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన గురుకుల బాలుర పాఠశాల లో గురువారం క్రీడారంగంలో హాకీ మాంత్రికుడైన ధ్యాన్చంద్ యావత్ దేశం గుర్తించుకోవాలని ప్రతి ఏటా ఆయన పేరు మీదగా క్రీడలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ క్రీడా దినోత్సవ సందర్భంగా పాఠశాలలోని క్రీడా విద్యార్థులు అందరూ వాళ్ళు యొక్క ప్రతిభను ఉపయోగించి భావి పౌరులుగా స్పోర్ట్స్ పటాలను డ్రాయింగ్ విధానంలో చక్కగా వెయ్యడం జరిగింది. ఆ విద్యార్థులలో కొంతమంది విద్యార్థులు పటాలతో చక్కగా స్పోర్ట్స్ చాట్ వేయడం జరిగింది. ఆ విద్యార్థులలో కొంతమందిని సెలెక్ట్ చేసి సీల్డ్ మెమొంటో ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ ఏటీపీ . రాధా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : హాకీ మాంత్రికుడైన ధ్యాన్చంద్ యావత్ దేశం గుర్తించుకోవాలి)