శాశ్వత పరిష్కార దిశగా తగు చర్యలు చేపడతాం
న్యూస్‌తెలుగు/వినుకొండ : శుక్రవారం వినుకొండలో కురిసిన వర్షానికి పట్టణ శివారు కాలనీలు లోతట్టు ప్రాంతాలకు నీరు రావడంతో హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ సిబ్బందితో ఆయా ప్రాంతాలకు చేరుకుని ఆయా గృహాలలోకి వర్షపు నీరు వెళ్లకుండా మళ్లింపజేశారు. అలాగే వర్షం నీరు వెళ్లిపోయేందుకు అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని మురుగును తొలగింప చేశారు.. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు..