పైడితల్లమ్మ వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ
న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లాలో ఆదివారం దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ. పర్యటించారు దీనిలో భాగంగా శ్రీ పైడితల్లి అమ్మవారిని చదురు గుడిలో దర్శించు కున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కు స్వాగతం పలికి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆలయ ఈవో డి.వి.వి. ప్రసాద రావు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని దేవాదాయ కమిషనర్ కు బహుకరించారు.
అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జిల్లా పరిషత్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ తో సమావేశమై అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. (Story : పైడితల్లమ్మ వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ)