‘అరి’ సినిమా నుంచి ‘చిన్నారి కిట్టయ్య’ లిరికల్ సాంగ్ రిలీజ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి చిన్నారి కిట్టయ్య లిరికల్ సాంగ్ మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట విడుదలై హిట్ అయింది. ఇప్పుడు చిన్నారి కిట్టయ్య పాట మంగ్లీ వెర్షన్ ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – ‘అరి’ సినిమా గురించి వింటున్నాను. ఈ మూవీ డైరెక్టర్ జయశంకర్ గతంలో పేపర్ బాయ్ అనే మంచి మూవీ రూపొందించారు. ఈ సినిమా కూడా ఆయన సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ‘అరి’ సినిమాలో ‘చిన్నారి కిట్టయ్య’ పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.
‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు – వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు. (Story : ‘అరి’ సినిమా నుంచి ‘చిన్నారి కిట్టయ్య’ లిరికల్ సాంగ్ రిలీజ్)