పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి వనపర్తి పట్టణంలో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సెయింట్ థామస్ హై స్కూల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూగురు రమేష్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మంగారి ఆలయ లో గల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఊర్మిళ చారి గారి కుమారుడి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. RG గార్డెన్ లో నిర్వహించిన కురుమన్న యాదవ్ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంకుర్ గ్రామానికి చెందిన జ్యోతి వర్ధన్ రెడ్డి గారి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు. లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ గారి తమ్ముడు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సంఘం ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీనివాసులు యాదవ్ గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెబ్బేరు మండలం వల్లపు రెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించిన అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బాబు కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి బంధుమిత్రులతో ఫోటోలు దిగుతూ కాసేపు సందడి చేశారు. అనంతరం పెబ్బేరు పట్టణంలోనీ బీసీ కాలనీ నందు నిర్వహించిన అంగన్వాడి ఉపాధ్యాయురాలు రాధమ్మ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే)