హ్యుందాయ్ ఫౌండేషన్ రూ.3.38 కోట్ల స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
న్యూస్‌తెలుగు/గురుగ్రామ్: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) దాతృత్వ విభాగం, హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్‌ఎంఐఎఫ్), సివిల్ సర్వీసెస్ పరీక్ష, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న బీద వర్గాలకు చెందిన అభ్యర్థులకు సహాయం చేయడానికి, భారతదేశం అంతటా ఐఐటి విద్యార్థుల ప్రాజెక్ట్‌లకు మద్దతు అందించటానికి ‘హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల మంత్రి హెచ్.డి.కుమారస్వామి, వర్టికల్ హెడ్-కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ సోషల్, హెచ్‌ఎంఐఎల్ పునీత్ ఆనంద్ సమక్షంలో ప్రారంభించారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా, హెచ్‌ఎంఐఎఫ్ రూ. 3.38 కోట్లు పెట్టుబడి పెడుతుంది, 300 మంది ఆశావహులు మరియు 150 ఐఐటి విద్యార్థి బృందాలకు ప్రయోజనం చేకూర్చనుంది.