Homeవార్తలుఎల్‌టిఐ మైండ్‌ట్రీ, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ల ఐటీ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌

ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ల ఐటీ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌

ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ల ఐటీ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి) ధార్వాడ్‌ ఎడ్యుకేషనల్‌ పార్టనర్‌గా, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ పార్ట్‌నర్‌గా ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఫౌండేషన్‌ ప్రారంభించిన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ అపూర్వ విజయం సాధించింది. జనవరి 2023లో హైదరాబాద్‌లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, పదోతరగతి తర్వాత విద్యను నిలిపివేసిన యువతకు అవసరమైన ఐటీ నైపుణ్యాలను అందించడానికి, తద్వారా సాంకేతికతతో నడిచే కెరీర్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా రూపొందించబడిరది. గత 18 నెలలుగా, ప్రయోగాత్మక అనుభవాలు, ప్రాజెక్ట్‌ వర్క్‌ ద్వారా పరిశ్రమకు సంబంధించిన ఐటి నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడంపై ఈ కార్యక్రమం విజయవంతంగా దృష్టి సారించింది. మునుపెన్నడూ కంప్యూటర్‌పై పనిచేయని చాలా మంది, కంప్యూటర్‌ పనితీరుపై ప్రాథమిక అవగాహనతో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆపై ఐటి ఆధారిత సేవలు లేదా పూర్తి స్టాక్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన స్నాతకోత్సవ వేడుకతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 80 మందికి పైగా విద్యార్థులను ఈ వేడుకలో సన్మానించారు. (Story : ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ల ఐటీ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!