మెడిమెక్స్ సోప్‌ఎరా-ఎ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రముఖ ఆయుర్వేద వ్యక్తిగత సంరక్షణా బ్రాండ్ మెడిమిక్స్ తాలూకు 55 ఏళ్ళ ప్రయాణాన్ని కళ్ళకు కట్టేలా, మెడిమెక్స్ కుటుంబం వారు సోప్‌ఎరా అనే ప్రత్యేకమైన కాఫీ టేబుల్ బుక్‌ని ఆవిష్కరించింది. నగరంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, ఈ పుస్తకం మొదటి ప్రతిని మాస్ట్రో ఇళయరాజాకి, డా.ఎ.వి.అనూప్, మేనేజింగ్ డైరెక్టర్, ఎవిఎ చోలాయిల్ హెల్త్ కేర్ ప్రై.లి, వి.ఎస్.ప్రదీప్, మేనేజింగ్ డైరెక్టర్ చోలాయిల్ అందజేశారు. సోప్‌ఎరా అనేది, మెడిమిక్స్ తయారీదారులు ఎంపిక చేసిన విషయాలతో రూపొందించిన ఒక విశిష్టమైన కాఫీ టేబుల్ బుక్, పరివర్తకంగా సాగిన 55 ఏళ్ళ ఘన చరిత్రని ఈ పుస్తకం వివరిస్తుంది. ఆయుర్వేదం శక్తిని ఆవిష్కరించేందుకు అన్వేషించిన డా.వి.పి.సిద్ధన్ సాగించిన స్ఫూర్తిదాయిక ప్రయాణాన్ని ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది. ఎ.వి.అనూప్ మాడ్లాడుతూ, వి.వి.సిద్ధన్ ప్రారంభించిన మెడిమిక్స్ ప్రయాణం తాలూకు ప్రయోజనం, ఆయన దార్శనికతలని అందంగా కళ్ళకు కట్టేలా ఈ సోప్‌ఎరా పుస్తకం ఉందన్నారు.