మెర్సిడెస్- బెంజ్ రెండు కొత్త వాహనాలు విడుదల
న్యూస్‌తెలుగు/ముంబయి: మెర్సిడెస్- బెంజ్ భారత దేశంలో రెండు అత్యధిక స్థాయి వాహనాలను ప్రవేశపెట్టంది. ఇది మెర్సిడెస్- ఏఎంజిజిఎల్‌సి 43 4 మెటిక్ కూప్ మరియు సిఎల్‌ఈ 300. ఇవి ఎక్కువగా కోరుకునే టాప్ ఎండ్ వాహన పోర్ట్‌ఫోలియోని, కేబ్రియోలెట్ ఏఎంజి లైన్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంది. మెర్సిడెస్- ఏఎంజిజిఎల్‌సి 43 4 మెటిక్ కూప్ మొదటిసారి చేతితో ప్రత్యేకంగా తయారు చేసిన ‘ఒక్క మనిషి ఒక్క ఇంజన్’ని భారత దేశంలో థ్రిల్లింగ్, గ్రాండ్ పిక్సెల్ స్థాయి పనితీరుని ఏఎంజికి అందించడానికి ఎస్‌యువి కూప్ ఆకర్షణీయమిన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంటుంది. భారత వినియోగదారులు కోరుకునే పనితీరు, జీవన విధానానికి సరిపోయే వాహనాలను తాము అందిస్తున్నామని మెర్సిడెస్ బేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. కాగా, మెర్సిడెస్ బెంజ్ సంస్థ పుణెలో 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద లగ్జరీ ఫెసిలిటీని ప్రారంభించింది. దాని 15 సంవత్సరాల దీర్ఘకాలిక భాగస్వామి- బియు భండారీతోబీ మెర్సిడెస్ బెంజ్ 2024 నాటికి 25 సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు మార్చనుంది. అలాగే, మెర్సిడెస్ బెంజ్ ‘మొబిలిటీ టు డిలైట్’ కస్టమర్ చొరవను ప్రవేశపెట్టింది,. మెర్సిడెస్ బెంజ్ ప్రత్యేకమైన ఈక్యూఎస్ మేబాక్ ఎస్యూవీని 2024 సెప్టెంబర్ 5న భారతదేశంలో విడుదల చేయనుంది. (Story : మెర్సిడెస్- బెంజ్ రెండు కొత్త వాహనాలు విడుదల)