UA-35385725-1 UA-35385725-1

 సెలబ్రేట్ చేసుకునే కమర్షియల్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’

 సెలబ్రేట్ చేసుకునే కమర్షియల్ సినిమా

‘డబుల్ ఇస్మార్ట్’

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఉస్తాద్ రామ్ పోతినేని

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ ‘డబుల్ ఇస్మార్ట్’ పూరి-రాంపేజ్ ట్రైలర్ లాంచ్

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్- థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.

ట్రైలర్ డబుల్ ఇస్మార్ట్  స్టొరీ లైన్ లోని ఒక గ్రిప్పింగ్ గ్లింప్స్ ని అందిస్తుంది. ఎక్సయిటింగ్, హై స్టేక్స్ తో కూడిన ప్లాట్‌ను రివిల్ చేస్తుంది. బిగ్ బుల్ సంజయ్ దత్ అమరత్వం కోసం ఓ సెన్సేషనల్ ఎక్స్పరిమెంట్ చేస్తాడు. డబుల్ ఇస్మార్ట్ బాడీలోకి తన బ్రెయిన్ ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అతని ప్లాన్. ఇది రెండు బిగ్ డైనమోల మధ్య ఇంటెన్స్ వార్ కి స్టేజ్ ని సెట్ చేస్తోంది

ట్రైలర్ అన్ని కమర్షియల్ హంగులతో ఆదరగొట్టింది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్ మాస్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్ చాలా స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా వుంది. శివలింగం వద్ద క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది.

రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో అద్భుతంగా కనిపించారు. తన పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో డబుల్ ఎనర్జీని తెచ్చారు. సంజయ్ దత్ బిగ్ బుల్‌గా టెర్రిఫిక్ గా వున్నారు. కావ్య థాపర్ సూపర్-హాట్‌గా కనిపించింది. రామ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది.

ట్రైలర్‌లో సినిమాటోగ్రాఫర్‌లు సామ్ కె నాయుడు, జియాని గియానెలీ ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో కట్టిపడేశారు, వారి విజువల్స్ మూవీని  డైనమిక్ ఎనర్జీతో నింపింది,  మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేసింది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి, గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కి ప్రామిస్ చేశాయి.

స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది, ఇది మెమరబుల్ సినిమాటిక్ వండర్ ని అందిస్తోంది. రామ్, పూరి కాంబో కలసి మాస్ హంగామా క్రియేట్ చేశారు. ఈ ట్రైలర్ నిస్సందేహంగా ఇటీవలి కాలంలో మనం చూసిన బెస్ట్ ట్రైలర్. భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ సినిమాపై ఎఫెక్టివ్ స్టేజ్ సెట్ చేసింది. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హాయ్ విశాఖపట్నం. 2018లో పూరి గారిని గోవాలో కలిశాను. ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు పదేళ్ళ తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామని అన్నాను. అప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ రాశారు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ వాడు. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ తో ఒక కిక్-యాస్  స్క్రిప్ట్ వుంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. అప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకొని చేశారు. చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసినప్పుడు ఎంత కిక్ వుంటుందో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ వుంటుంది. కమర్షియల్ సినిమా అంటే గుర్తుకువచ్చేది పూరి గారే. కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంక దేంట్లో రాదు. కమర్షియల్ సినిమాలో థియేటర్స్ లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూశాను. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కి ఆ కిక్ వుంటుందని ఆశిస్తున్నాను. అందరం చాలా ఇష్టపడి చేశాం. అలీ గారు ట్రాక్ చాలా ఎంజాయ్ చేస్తారు. కావ్య స్వీట్ హార్ట్. చాలా మంచి అమ్మాయి. టెంపర్ వంశీ క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. విష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తను ఛార్మి గారికి రైట్ హ్యాండ్ లాంటి వాడు. చాలా కష్టపడ్డారు. థాంక్ యూ ఛార్మి గారు. ఫ్యాన్స్ నుంచే ఎనర్జీ వస్తుంది. వైజాగ్ వచ్చిన ప్రతిసరి ఆ ఎనర్జీ తీసుకెళ్లా. ఆగస్ట్ 15న కలుద్దాం. మార్ ముంతా చోడ్ చింతా. థాంక్ యూ అల్’ అన్నారు.

స్పెషల్ వీడియో బైట్ లో డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ. హాయ్ ఎవ్రీ వన్. ఈ ఫంక్షన్ లో మీతో పాటు నేనూ వుండాలి. కానీ సెన్సార్  కోసం ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో వుండి ఈవెంట్ కి రాలేకపోయాను. వెరీ సారీ. ఈవెంట్ కి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. వైజాగ్ లోనే తిరిగేవాడిని. అక్కడ ప్రతి థియేటర్ లో సినిమాలు చూశాను. ఆ సినిమా పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యాను.(నవ్వుతూ) సినిమా పెద్ద హిట్ అయ్యాక వైజాగ్ వచ్చి పర్సనల్ గా మీ అందరినీ కలుస్తాను. గల్లీలో తిరిగినవాడిని. నేను తీసిన గల్లీ సినిమా. సీ సెంటర్లో సీటులు వేస్తూ చూడాల్సిన సినిమా. ట్రైలర్ ని ఎంజాయ్ చేయండి. లవ్ యు ఆల్’ అన్నారు.

పూరి కనెక్ట్ సీఈఓ విష్ మాట్లాడుతూ.. హాయ్ వైజాగ్. కొన్ని రోజుల ముందు సినిమా చూశాను. నా జెన్యూన్ ఫీలింగ్ చెబుతున్నా. మంచి ముంతకళ్ళు తాగి మంచి బిర్యాని తిని డబుల్ కా మీట తిన్న తర్వాత ఎలా వుంటుందో సినిమా చూసినప్పుడే అదే ఫీలింగ్ వుంటుంది. ఇది స్మాషింగ్ హిట్. అందరూ ఆగస్ట్ 15న తప్పకుండా సినిమా చూడండి. అలీ గారి ట్రాక్ అద్భుతంగా వుంటుంది. రామ్ భయ్యా చించేపడేశారు. ఛార్మి, పూరి గారికి థాంక్ యు సో మచ్. డైరెక్టర్, యాక్టర్ కావాలనుకునే ఎవరైన పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూడవాల్సిందే. ఈ సందర్భంగా పూరి గారికి కృతజ్ఞతలు’ తెలిపారు.,

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. రామ్ గారు, పూరి గారితో వర్క్ చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం లక్కీగా ఫీలౌతున్నాను. ఆగస్ట్ 15 న డబుల్ ఇస్మార్ట్ బ్లాస్ట్ కాబోతోంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కళాకారులని ప్రేమించే నగరం విశాఖ. ఈ వేడుక ఇక్కడ జరగడం ఆనందంగా వుంది. విశాఖ వున్న వజ్రం మా పూరి గారు. రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రామ్ ఎనర్జీతో పూరి గారి డైరెక్షన్ తో మణిశర్మ గారి మ్యూజిక్ తో  ఈ సినిమా అద్భుతంగా వుంటుంది. థియేటర్ కి పట్టిన తుప్పుని వదలగొట్టే సినిమా ఇది. కావ్యచాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పూరిగా ఓ కొత్త భాషని కనిపెట్టి ఓ అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే’ అన్నారు.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు. (Story :  సెలబ్రేట్ చేసుకునే కమర్షియల్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1