వంధ్యత్వంపై ఫెర్టీ9 టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అవగాహన
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం 2024ను పురస్కరించుకుని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన వినూత్నమైన టుగెదర్‌ఇన్‌ఐవీఎఫ్ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో నిర్వహించిన ఈ ప్రచారం ద్వారా ప్రజలలో అవగాహన మెరుగుపరచడం, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) పట్ల అంగీకారాన్ని పెంచడం లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం, తమ సంతానోత్పత్తి చికిత్స గురించి తగిన సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా జంటలను ప్రోత్సహించటం చేసింది. ఈ ప్రచారం కింద, ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవ వారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 15 వేర్వేరు ప్రదేశాలలో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించింది. తద్వారా అధిక సంఖ్య లో ప్రజలకు చేరువైంది. ఈ ప్రదర్శనలు అనుకూలమైన, ప్రభావవంతమైన పద్ధతిలో సాధారణ ప్రజల కోసం వంధ్యత్వం, ఐవిఎఫ్ పట్ల ఉన్న అపోహలను నిర్వీర్యం చేయడంలో సహాయపడ్డాయి. అలాగే, ఐవిఎఫ్ విధానాలలో సంపూర్ణత మరియు ప్రశాంతత ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ను విడుదల చేసింది. (Story : వంధ్యత్వంపై ఫెర్టీ9 టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అవగాహన)