గోవులను రక్షించాలని శ్రీ కృష్ణుడు కి వినతి
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణం లో జరుగుతున్న గోవుల నరికి వేత, విదేశాలకు రవాణా చేస్తున్న గో హంతకులును శిక్షించడానికి శ్రీ కృష్ణుడు మరో అవతారం ఎత్తి గోవులును రక్షించాలని ఆంధ్రప్రదేశ్ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిశ. రామకృష్ణ అన్నారు. మంగళవారం కొత్తపేట నీళ్లట్యాంక్ సెంటర్ లో గల శ్రీ కృష్ణుడి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం మునిసిపల్ పరిధిలో గోవులు చంపి మాoసం కంపెనీలుకు ఎగుమతి చేస్తున్నావారిపై ఎటు వంటి కేసులు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు ఆవుల నరికివేత, మాoసం అమ్మే కేంద్రలు నిరంతరం కొనసాగుతున్న దానిని అరికట్టావలిసిన మునిసిపల్, పోలీస్, రెవిన్యూ పశుసంవర్ధక రవాణాశాఖలు కసాయి వారితో కుమ్మక్కు అయి కసాయి వారి మీద ఈగ వా లకుండా చూసుకుంటున్నారన్నారు. సాక్షాత్తు కేంద్ర మాజీమంత్రి మేనకా గాంధీ ఫిర్యాదు చేసినా పై శాఖల అధికారులు అసలు పట్టణం లో ఎటువంటి గో వధలు జరగడం లేదని నివేదిక ఇచ్చారన్నారు. కంచె చేను మేసి సినట్టు గోవులు కాపాడ వలసిన అధికారులు కసాయి వారికీ పూర్తి అండదండలు అందిస్తున్నందున శ్రీ కృష్ణుడే మరో అవతారం ఎత్తి గోవిందుడే గోవులును రక్షించుకోవాలని వినతి పత్రం అందజెశారు. ఈ సందర్బంగా కృష్ణుడు రావాలి -గోవులును కాపాడాలి.గోవిందుడురావాలి -గోవులను రక్షించాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వి.ఆర్ సత్యనారాయణ,జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజకుమారి, పట్టణ అధ్యక్షులు మద్దిల సోంబాబు, బ్రాహ్మణ సంఘ నాయకులు టీవీ శ్రీనివాసరావు , జిల్లా మహిళా నాయకురాలు నీలాపు దేవి, గండికోట శాంతి,చింతలపూడి రూపవతి, ఎం మాధవి లత తదితరులు పాల్గొన్నారు. (Story : గోవులను రక్షించాలని శ్రీ కృష్ణుడు కి వినతి )