హ్యుందాయ్ మోటార్లో ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి
న్యూస్‌తెలుగు/గురుగ్రామ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్), దేశవ్యాప్తంగా తొమ్మిది భారతీయ రాష్ట్రాల్లోని తమ డీలర్ నెట్‌వర్క్‌లో ఐటిఐలు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ల నుండి 403 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను అందించినట్లు ప్రకటించింది. ఐటిఐలు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని హెచ్ఎంఐఎల్ నిర్వహించటంతో పాటుగా దాని విస్తృత శ్రేణి నెట్వర్క్ డీలర్ల వద్ద అర్థవంతమైన ఉపాధి అవకాశాలను పొందడానికి విద్యార్థులకు మరింతగా సహాయం చేస్తుంది. ఇటీవలి రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో నిర్వహించారు. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ అనే హ్యుందాయ్ అంతర్జాతీయ లక్ష్యంకు కట్టుబడి, హెచ్ఎంఐఎల్ జీవితాలను సుసంపన్నం చేయడం, భారతదేశ యువత కలలను సాకారం చేయడం, మెరుగైన భారత్‌ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. (Story : హ్యుందాయ్ మోటార్లో ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి)