విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): పట్టణం లోని స్థానిక కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రథమ సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఉచితంగా యూనిఫాం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం అందించడం సంప్రదాయం మారిన నేపధ్యం తెలిసినదే. ఆ ఆనవాయితిలో భాగంగా ఈ యేడాది 2024 – 2025 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది సాజన్యం తో దాదాపు 40 విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం అందించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు అధ్యాపకులకు బోధనేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డా॥ బి. త్రివేణి, డా. ఎస్ చిట్టమ్మ , డా|ఎస్.షమీఉల్లా ,డా॥ బి గోపాల్ నాయక్, ఎ. కిరణ్ కుమార్ ,యం. భువనేశ్వరి, బి. ఆనంద్. టి.సరస్వతి, యల్. సుభాషిని , వి. వెంకటలక్ష్మి, వై. తావారి అలీ, జి మీన, ఎస్.పి .రాజేంద్ర నాయక్, జి ధనుంజయ, బి .గంగా.. తదితర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story: విద్యార్థులకు యూనిఫాం పంపిణీ)