8వ జూ.బ్యాడ్మింటన్ టోర్నీని లాంచ్‌చేసిన పీఎన్‌బీ మెట్‌లైఫ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఇండియాలో ప్రీమియర్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటైన పీఎన్‌బీ మెట్‌లైఫ్ 8వ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (జేబీసీ)ని సగర్వంగా ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా యువ బ్యాడ్మింటన్ ఔత్సాహికుల్లో అభిరుచిని రగిలించే కార్యక్రమంగా నిలుస్తుంది. గత ఎడిషన్లు సాధించిన భారీ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఛాంపియన్‌షిప్ క్రీడాస్ఫూర్తి, నైపుణ్యాభివృద్ధి, ఇండియాలోని యువ షట్లర్లలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా నిలవనుంది. ఈ ఏడాది ఛాంపియన్‌షిప్ 10 ప్రధాన నగరాల్లో జరగనుంది. ఈ సందర్భంగా పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈఓ సమీర్ బన్సల్ మాట్లాడుతూ, త్వరలో జరగబోయే గేమ్‌లపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మన దేశంలోని యువతలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి పర్యాయపదంగా మారిందన్నారు. ఏషియన్ గేమ్స్ గోల్డ్‌మెడలిస్ట్, పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మెంటార్ చిరాగ్ శెట్టి కూడా పాల్గొన్నారు. (Story : 8వ జూ.బ్యాడ్మింటన్ టోర్నీని లాంచ్‌చేసిన పీఎన్‌బీ మెట్‌లైఫ్)