మంత్రి సీతక్క రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్
న్యూస్ తెలుగు /కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో ఫుడ్ పాయిజనింగ్ వలన చనిపోయిన చౌదరి శైలజ పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.
మాట్లాడుతూ గత నెల 29వ తేదీ ఫుడ్ పాయిజనింగ్ వలన 42 మంది విద్యార్థులను వివిధ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే , నిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న చౌదరి శైలజ 16″ చనిపోవడం చాలా బాధాకరమైన విషమని, విద్యార్థి మృతి ప్రభుత్వ హత్యేనని, దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎక్సగ్రేషియా, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. (Story : మంత్రి సీతక్క రాజీనామా చేయాలి )