యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి
సర్కిల్ ఇన్స్పెక్టర్ చలమంద రాజు
న్యూస్ తెలుగు నేరేడుచర్ల : నేటి ఆధునిక సమాజంలో యువత అన్ని విషయాలపై అవగాహనతో
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు అన్నారు. నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు నేటి సమాజంపై ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ సైబర్ క్రైమ్, గంజాయి,మద్యం మత్తు పదార్థాలవలన జరిగే నష్టాలను విద్యార్డులకు తెలియజేశారు. వీటిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. చక్కగా చదువుకొని భవిష్యత్తు కు బంగారు బాటలు నిర్మించుకోవాలని దేశం గర్వించే పౌరులుగా తయారు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రవీందర్ కళాశాల ప్రిన్సిపాల్ గుడిపాటి లక్ష్మయ్య, వనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (Story : యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి)