1,200పైగా నగరాలకు పీబీ పార్ట్‌నర్స్ బీమా సదుపాయాల విస్తరణ
న్యూస్‌తెలుగు/ ముంబయి: పాలసీబజార్ పీఓఎస్‌పీ విభాగం పీబీ పార్ట్‌నర్స్, గత 3 ఏళ్లుగా అంకితమైన ఆఫ్‌లైన్ సేవలతో ఏజెంట్ భాగస్వాములు, వినియోగదారుల జీవితాలపై తన ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ, 3వ వార్షికోత్సవాన్ని సగర్వంగా ఆచరించుకుంటోంది. పీబీ పార్ట్‌నర్స్ గత 3 ఏళ్లలో గణనీయ మైలురాళ్లను నెలకొల్పింది. తన 1.2 లక్షల మంది సర్టిఫైడ్ భాగస్వాములతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని, 18,000పైగా పిన్ కోడ్‌లకు సేవలు అందిస్తూ, దేశవ్యాప్తంగా 1,200పైగా నగరాల్లో పని చేస్తోంది. పాలసీ జారీ నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు అంతరాయం లేని ఆఫ్‌లైన్ సేవల అందుబాటును ఈ నెట్‌వర్క్ నిర్ధారిస్తుంది. ముఖ్యంగా టైర్-2 మరియు టైర్-3 నగరాల్లో గణనీయమైన వ్యాపార వృద్ధిని పెంచుతూ, బీమా కవరేజీని విస్తరిస్తుంది. పీబీ పార్ట్‌నర్స్ 16 కన్నా ఎక్కువ నగరాల్లోని అత్యుత్తమ శ్రేణి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల నుంచి పనిచేస్తూ, డిజిటల్ పరిష్కారాలు అందుబాటులో లేని చిన్న నగరాలు, పట్టణాలలో (టైర్ 2 మరియు టైర్ 3) జనాభాకు సమగ్ర బీమా పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉంది. (Story : 1,200పైగా నగరాలకు పీబీ పార్ట్‌నర్స్ బీమా సదుపాయాల విస్తరణ)