శ్రీ చైతన్య పాఠశాలలో గ్రీన్ ఇండియా మిషన్
న్యూస్ తెలుగు/విజయనగరం: విజయనగరం పట్టణంలో కామాక్షి నగర్ వద్ద ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రాంతీయ అధికారి శ్రీనివాసరావు విద్యార్థుల సుద్దేశించి మాట్లాడుతూవృక్షో రక్షిత రక్షితహాః మనం చెట్లను నరికివేయకుండా కాపాడి నపుడే చెట్లు మనకు సకాలంలో వర్షాలు కురియడానికి, స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఉద్ఘాటించారు. పాఠశాల ప్రదానోపాడ్డాయిని ఎమ్ జ్యోతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి డస్ట్ బిన్లాను ఉపయోగించాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రతి ఒక్క విద్యార్థి తన ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగాం విద్యార్థులకు నిర్వహించిన వార్విసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది శ్రీనాధనాయుడు , అప్పలనాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: శ్రీ చైతన్య పాఠశాలలో గ్రీన్ ఇండియా మిషన్)