సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం
కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయాలలో సమాన అవకాశాలు కల్పించే విధంగా పాటుపడుతాం
భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా సమితి
న్యూస్ తెలుగు/వినుకొండ : భారతదేశ సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు పల్నాడు జిల్లా వినుకొండ సిపిఐ కార్యాలయం పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ. 1949 నవంబర్ 26వ తేదీ నాటికి ఏర్పాటైన రాజ్యాంగం 26 జనవరి 1950లో మన దేశంలో అమల్లోకి వచ్చిందని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం రాజ్యాంగ పీఠికలో వ్రాసుకున్నటువంటి ప్రజల హక్కులు, సామాజిక ఆర్థిక రాజకీయాలలో పౌరులు అందరూ పూర్తి న్యాయాన్ని పొందలేకపోతున్నారని దేశంలో పోగవుతున్న సృష్టించబడుతున్న సంపద పేద ప్రజలకు అందడం లేదని ప్రజలందరూ సమాన న్యాయం హక్కులు పొందటంలో పూర్తిగా అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రోద్యమంలో ఆవిర్భవించి సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడిందని స్వాతంత్ర్యం అనంతరం ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తుందని భూమి కోసం భుక్తి కోసం బడుగు జీవుల విముక్తి కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందని పేద ప్రజలకు లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేసిందని పీడిత తాడిత దళిత బలహీన వర్గాలకు కార్మికులకు రైతాంగానికి అండగా నిలిచి వారి హక్కులకై పోరాడుతోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న పాలకులు సాధించుకున్న హక్కులను కాలరాయడానికి కులమత అంతరాలను సృష్టిస్తూ మతోన్మాదాన్ని ప్రజల్లో మత్తుమందులా ఎక్కిస్తూ ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తు పదవులను కాపాడుకుంటున్నారని పేదవాడు మరింత పేదవాడిగా, బలవంతుడు కోటీశ్వరుడు పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులుగా లక్షల కోట్లు అర్జించేవారిగా తయారవుతున్నారని ఇటువంటి ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయాలలో పూర్తి న్యాయం జరిగేలా సమసమాజ స్థాపన కోసం పోరాడుతుందని ఆయన అన్నారు. ముందుగా దేశ పౌరులుగా ఈ దేశ రక్షణ కోసం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని రాజ్యాంగ పీఠిక లోని అంశాలు అమలు జరిగే విధంగా దేశ పౌరులకు రక్షణగా నిలబడతామని “ప్రతిజ్ఞ” చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు మాజీ చైర్మన్ సండ్రపాటి సైదా, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, కార్యవర్గ సభ్యులు రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జునరావు, షేక్ కిషోర్, షేక్ నబీ సాహెబ్, లక్ష్మానాయక్, సోడాల సాంబయ్య, షేక్ మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, నక్కా శ్రీదేవి, షేక్ హుస్సేన్ వెంకటేశ్వర్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.(Story :సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ )

