భారత లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : భారత లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తి సిపిఐ ఆఫీస్ వద్ద జిల్లా కార్యవర్గ సభ్యురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశం భిన్న మతాలకు భిన్న సంస్కృతులు ఆచార వ్యవహారాలకు నిలయమన్నారు. స్వాతంత్రం సిద్ధించాక పాలన విధానం ఎలా ఉండాలన్న దానిపై దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రాశారన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒక మతానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని, అందరికీ సమాన హక్కులు లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని వ్యతిరేకంగా పోరాడాలి తిప్పి కొట్టాలన్నారు. నేతలు కళావతమ్మ గోపాలకృష్ణ పృథ్వినాదం జయమ్మ శిరీష చిన్న కుర్మయ్య, వంశీ, రూప మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.(Story : భారత లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి )

