రాయి కొట్టే కార్మికుని నుండి రాజకీయాలను శాసించే స్థాయికి
న్యూస్ తెలుగు/వనపర్తి : నందిమల్ల తిరుమలయ్య మాజీ సింగిల్ విండో అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గారి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా బిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ స్వగృహంలో వారి తండ్రి తిరుమలయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ తిరుమలయ్య అన్న అంటే తనకు ఎంతో అభిమానమని ఏనాడు తన సొంతం కోసం ఏది అడగకుండా నిత్యం ప్రజల సమస్యల కోసం పరితపించే వారని అతి సామాన్య కుటుంబములో పుట్టి కార్మిక నాయకునిగా కౌన్సిలర్ గా,సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. మాజీ కౌన్సిలర్ నందిమల్ల.శారద అశోక్ , కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యంతో ప్రజలకు,కుటుంబసభ్యులకు అండగా ఉండాలని అన్నారు.భగవంతుడు తిరుమలయ్య అన్న ఆత్మకు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వెంట వాకిటి.శ్రీధర్,పలుస.రమేష్ గౌడ్,కె.మాణిక్యం,ఏం.డి.గౌస్,నందిమల్ల.రమేష్,ఉంగ్లం. తిరుమల్,రమేష్ చంద్ర,మహేశ్వర్ రెడ్డి,నీలస్వామి,సయ్యద్.జమీల్,వహీద్,చోటు బాయ్,ముద్దుసార్,మాజీ సర్పంచ్.యాదయ్య,కొత్తకోట.బాలయ్య,తదితరులు ఉన్నారు.(Story : రాయి కొట్టే కార్మికుని నుండి రాజకీయాలను శాసించే స్థాయికి )

