చట్టాలను ఉల్లంఘిస్తూ మోతుగూడెం గ్రామంలో ప్రైవేటు కట్టడాలు నిర్మిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవాలి
న్యూస్ తెలుగు/చింతూరు : ఇటీవల సీలేరు నది పరివాహక ప్రాతంలో టూరిజం,సినిమా షూటింగ్ అధికంగా పెరగడం, ఎకో -టూరిజం పెరగడం వలన సీలేరు నది పరివాక ప్రాతంలో ఇటీవల అక్రమంగా బహుళ అంతస్తుల కట్టడాలు నిర్మించడం, అ ప్రాతంలో నీటి కోసం రిగ్గు ద్వారా బోరింగ్ కొట్టం జరుతుంది ఈ చర్య వలన డ్యామ్ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది, సీలేరు నదికి రావాల్సిన సహజసిద్దమైన ఊట నీరు రాకుండా సీలేరు నది ప్రవాహం కు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉన్నది. సీలేరు నది ప్రాతం మొతుగూడెం ప్రాతం వణ్యప్రాణ సమరక్షణ చట్టం జోన్ లోకుడా ఉన్నది. ఈ ప్రాతంలో ఎటువంటి కట్టడం కట్టాలన్న ఫారెస్ట్ అనుమతులు తప్పనిసరి, సీలేరు ప్రాజెక్టు అథారిటీ అనుమతులు, గిరిజన చట్టాల అనుమతులు కొరకు పిసా గ్రామ కమిటీ తీసుకోవాలి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు జరుగుతున్న అధికారులు నిద్రపోవడం చూసి చూసి చూడనట్టు వదిలిపెట్టడంలో మర్మమేంటో? పై చట్టాల అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ నిర్మాణాలు నిర్మించడం కొరకు సహకరించిన ఆదివాసి ల పేరుతో బినామీల నిర్మాణాలు చేసిన ఆదివాసీలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రాయతీ లు నిలిపివేయాలి. లేని పక్షంలో సీలేరునది సమరక్షణ కోసం, ఆదివాసీ చట్టం, ఫారెస్ట్ చట్టం, హై డ్రాలీక్ ప్రాజెక్టు సమరక్షణ కోసం పెద్దఎతున్న ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.(Story : చట్టాలను ఉల్లంఘిస్తూ మోతుగూడెం గ్రామంలో ప్రైవేటు కట్టడాలు నిర్మిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవాలి )

