Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎమ్మెల్సీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఎమ్మెల్సీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఎమ్మెల్సీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

న్యూస్ తెలుగు /చింతూరు : రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి. మిరియాల శిరీష దేవి పై అసత్య ప్రచారం, బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం చింతూరు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కు పిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ అనంత బాబు పై చర్యలు తీసుకోవాలనీ మండల టీడీపి నాయకులూ పోలీస్ స్టేషన్ లో సోమవారం టిడిపి నేతలు స్టేషన్లో పిర్యాదు చేశారు.ప్రస్తుత ఎమ్మెల్సీ రంపచోడవరం నియోజకవర్గం ఎస్టీ ఎమ్మెల్యే అయినటు వంటి మిరియాల శిరీషదేవి పై తరచూ ఆరోపణలు , అసత్య ప్రచారాలు చేస్తున్నాడనీ, ఆయన తీరు వలన ప్రభుత్వప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తున్నాడనీ, ఎమ్మెల్యే పై మానసిక దాడులు చేస్తున్నారని, కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో ఆమె పరువు, ప్రతిష్ట లకు తీవ్ర విఘాతం కలిగేలా చేస్తున్నారూ. ఆయన చర్య వలన ప్రభుత్వంపై కూడా మచ్చ పడేలేఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహారిస్తున్నాడనీ, సామాజిక మధ్యమాల్లో ప్రజలకు కూటమి ప్రభుత్వం పై తప్పుడు అభిప్రాయం కలిగేలా వదంతులు సృష్టిస్తున్నారనీ అన్నారు. ఆయన మాటలు ద్వారా నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా భావోద్వేగాలను రెచ్చగొడుతూ అలజడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా ఆయన కనుసైగ చేస్తే అమెరికాలో ఉండి కూడా మీ అంతు చూడగలను మిమ్మల్ని చంపుతానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని. ఆయన వ్యాక్యాలు ఎమ్మెల్యే, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని, ఆయన పై చర్యలు తీసుకోవలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎండీ. జహంగీర్, సీనియర్ నాయకులు అనిగి. చంద్రయ్య, తుర్రం. చిన్నముతయ్య,చింతురు మాజీ సర్పంచ్ సోడే.శ్రీనివాస్ జాఫర్, సవలం మోహన్, యస్ కే. జానీ, రామిశెట్టి, ఎండీ. రియాజ్, సంతోష్,తదితరులు పాల్గొన్నారు.(Story : ఎమ్మెల్సీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!