అవినీతి,అరాచక శక్తుల చేతులలో గోపాలపురం
బుడ్డర్ ఖాన్ బెదిరింపులకు భయపడవద్దు
మిద్దె.అశోక్ ను భారీ మెజారిటీతో గెలిపించండి
కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టండి
న్యూస్ తెలుగు/వనపర్తి : సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పానగల్ మండలం గోపాలపురం గ్రామములో మాజీ ఎం.ఎల్.ఏ బీరం.హర్షవర్ధన్ రెడ్డి గారితో కలసి విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు,6గ్యారంటీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా ఓట్లు అడగడానికి నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా,ధాన్యానికి బోనస్,మహిళలకు 2500,వృద్ధులకు 4000,వికలాంగులకు 6000,తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు,ఆటో కార్మికులకు 12000,కె.సి.ఆర్ కిట్టు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు.గ్రామాన్ని కొన్ని ఏండ్లుగా పెత్తనం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిని ఓడించాలని యువకుడు మిద్దె.అశోక్ ను గెలిపిస్తే నేను హర్షవర్ధన్ రెడ్డి అండగా ఉండి అభివృద్ధి తోడ్పడతాయని అన్నారు. బీరం.హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామన్న గట్టు రిజర్వాయర్ సాధించి గోపాల్పూర్ సస్యశామలం చేస్తామని అన్నారు.మిద్దె అశోక్ ను గెలిపిస్తే మీ గ్రామానీ ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.పి.శ్రీధర్ రెడ్డి,జిల్లా ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మండల కన్వీనర్ వీరసాగర్,మిద్దె.కృష్ణ,మాజీ సర్పంచ్ చందు నాయక్ పాల్గొన్నారు. మాజీ మంత్రి సమక్షంలో యువ నాయకులు గ్రామ అభివృద్ధికి నడుముకట్టిన కిషోర్ శెట్టి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
(Story : అవినీతి,అరాచక శక్తుల చేతులలో గోపాలపురం )

